Tollywood Heros : శివుని పాత్ర అంటే అంత తేలికా… ఆ స్థాయి లేని వాళ్లు కూడా…

Tollywood Heros : మనకు ఉన్న సాహిత్య సంపద గురించి, పురాణ ఇతిహాసాల గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో విషయంపై ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. ఒక రామాయణానికే దాదాపు 300 వెర్షన్స్ ఉంటాయి. అలానే మన కథలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కల్కి అనే ఒక సినిమా వస్తేనే కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు, అశ్వద్ధామ అంటూ చాలా డిస్కషన్స్ మొదలయ్యాయి. ఒక విషయంపై అందరికీ ఒకే రకమైన అభిప్రాయం, అవగాహన రెండు ఉండవు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో తెలుగు సినిమాలన్నీ కూడా మన కథలను మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు మన కథను మనకు చెప్పడమే సరైన ఆప్షన్. లేదంటే ఎక్కడి నుంచి కాపీ కొట్టిన కూడా, ఈ సీన్ ఇకనుంచి తీసుకున్నారు. ఈ ఫ్రేమ్ ఇది చూసి పెట్టారు అని చెప్పగలిగే ఆడియన్స్ వచ్చేసారు.

ఇప్పుడు తెలుగు సినిమా దర్శకులు అంతా పురాణ ఇతిహాసాల మీద పడడం మొదలుపెట్టారు. హనుమాన్, కల్కి, కన్నప్ప వంటి సినిమాలు అన్నీ కూడా మన కథలను బేస్ చేసుకొని తీసేవే. ఇక ఇప్పుడు లార్డ్ శివ మీద కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. ఈ పాత్రకు నేను సెట్ అవుతాను అంటే నేను సెట్ అవుతాను అని చాలామంది హీరోలు చంకలు గుద్దుకోవడం మొదలుపెట్టారు. అయితే వాస్తవానికి ఆ పాత్రను వేయటం అంత తేలికైన విషయమా అంటే అది కాదు. ఆ పాత్రను వేయాలన్నా కూడా ఒక స్థాయి కావాలి అని చాలామంది డిస్కషన్స్ కూడా మొదలుపెడతారు.

Shiva

- Advertisement -

శివునిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే..

ప్రపంచంలో మనమందరం భయపడే ఒకే ఒక లక్షణం చావు. అది దగ్గరకి వస్తే వణికిపోతాం. కానీ ఈ నేల గొప్పతనం ఈ జాతి గొప్పతనం చావును Celebrate చేసుకోగలగటం. అది కాశీ నిండా కనిపిస్తుంది. అందరూ భయపడే చావును కళ్ళలోకి చూసి, దానిని పిలిచి ధైర్యంగా చావటం గొప్ప లక్షణం, ఆ లక్షణాన్ని చెప్పే Concept నే శివుడు. ఒక కంట్లో నిప్పు, గొంతులో విషం, మెడలో పాము, ఉండేదేమో స్మశానం, పిడికిట్లో మరణం, ఇంత గొప్ప భయంకరమైన ఒక వ్యక్తిని, మనం మన ఇంట్లో పెట్టుకుని, గుండెల్లో పెట్టుకుని, మనతో పాటు తోడు తీసుకెళ్తూ ప్రతీ రోజు “ఓం నమః శివాయ” అనుకుంటాం.

ఇంతటి గొప్ప లక్షణాలున్న శివుని పాత్రను పోషించడానికి చాలామంది టాలీవుడ్ హీరోలు పోటీ పడుతూనే ఉంటారు. కే విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమాలో కూడా శివునివేశం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వేయాలంటే మనల్ని మించిన వాళ్ళు ఎవరున్నారు అని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే శ్రీ మంజునాథం అనే సినిమాలో ఇదివరకే చిరంజీవి శివుని పాత్రలో కనిపించారు. ఇక అఖండ వంటి సినిమా చూసిన తర్వాత శివుని పాత్రకి బాలకృష్ణ కరెక్ట్ అని చాలామంది మాట్లాడుతుంటారు. రీసెంట్ గా థమన్ కూడా శివం భజే అనే మూవీ ఈవెంట్ లో ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత విశ్వక్సేన్ కూడా శివుని పాత్రకు తానే కరెక్ట్ అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు.

ఒక ఇంటర్వ్యూలో శివుని పాత్ర మహేష్ బాబుకు బాగా సెట్ అవుతుంది అంటూ ఒక యాష్పైరింగ్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరూ శివుని పాత్రకి మేము సెట్ అవుతాం అని అనుకుంటున్నారు తప్ప అసలు ఆ పాత్రకు ఉన్న విలువ గురించి ఆ పాత్రకు ఉన్న స్థాయి గురించి ఏ హీరో కూడా ఆలోచించట్లేదు. బాహుబలి సినిమా చూసిన తర్వాత ఆ పాత్రకు ప్రభాస్ కరెక్ట్ అని చాలామంది అనుకున్నారు. డమరుకం సినిమా రిలీజ్ అయినప్పుడు నాగార్జున కూడా శివుని పాత్రలో కనిపిస్తే బాగుంటుందని కొంతమంది అనుకున్నారు. ఏదేమైనా కూడా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉన్నట్లు… అలానే ఒక పాత్రకు కూడా సరైన పర్సన్ ఉండి ఉంటారు వాళ్లు ఆ పాత్రను చేసినప్పుడే, ఆ సినిమా అత్యద్భుతంగా ఎలివేట్ అవుతుంది. కలెక్షన్ కు కొత్తదారి చూపిస్తుంది. కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు