Tollywood : బాలయ్య నుంచి చెర్రీ దాకా… టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ కి ఇంట్రెస్టింగ్ రూమర్డ్ టైటిల్స్

Tollywood : టాలీవుడ్ సినిమాల స్పాన్ పెరగడమే కాదు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది తెలుగు సినిమాలకు. అందుకే ఏదైనా సినిమాను అనౌన్స్ చేస్తే చాలు వెంటనే కుప్పలు తెప్పలుగా దాని గురించి రూమర్స్ వస్తున్నాయి. అలా షికార్లు చేస్తున్న పుకార్లలో పలు అప్ కమింగ్ సినిమాల టైటిల్స్ కూడా ఉన్నాయి. బాలయ్య నుంచి చెర్రీ, ప్రభాస్ ఫ్యాన్స్ దాకా మేకర్స్ ప్రకటించక ముందే ఉత్సాహంతో సోషల్ మీడియాలో సినిమాల పేర్లు ఇవేనంటూ రూమర్స్ పుట్టిస్తున్నారు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల దాకా పలు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే దాదాపుగా రూమర్డ్ టైటిల్స్ చాలా సినిమాలకు ఖరారు కావడం. మరి నెటిజన్లు ఏ సినిమాకు ఏ టైటిల్ ను పెట్టారో తెలుసుకుందాం పదండి.

అఖిల్ ధీర

బాలయ్య వీర మాస్

బాబీతో బాలయ్య తదుపరి చిత్రం #NBK109. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వీర మాస్ అనే టైటిల్ తో రాబోతుందని అంటున్నారు.

మెరుపుగా కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ#NKR21ని ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మెరుపు అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

ఎన్టీఆర్ డ్రాగన్

డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టును ప్రస్తుతం #NTR31 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటూ ఉండగా, భారీ అంచనాలు ఉన్న చిత్రాలలో ఒకటి మరియు ఇప్పటికే డ్రాగన్ అనే టైటిల్‌ను పెట్టినట్లు టాక్ నడుస్తోంది.

ప్రభాస్ ఫౌజీ

ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆయన చేతిలో ఉన్న ప్రస్తుత కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత హను షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

పెద్దిగా చెర్రీ

డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా పెట్టినట్లు సమాచారం.

మరికొన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్

సాయి ధరమ్ తేజ్ #SDT18కి సంబరాల ఏటిగట్టు, #Sharwa36 రేస్ రాజా. ఎఫ్2, ఎఫ్3 తర్వాత #వెంకీఅనిల్3కి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టారు. బెల్లంకొండ శ్రీనివాస్ రెండు చిత్రాలకు #BSS11, #BSS12 వరుసగా కిష్కింధపురి, హైంధవ అనే టైటిల్‌లు వినిపిస్తున్నాయి.

మరి వీటిలో ఎన్ని టైటిల్స్ అఫీషియల్ పోస్టర్స్‌లో చోటు దక్కించుకుంటాయో చూడాలి, అయితే అభిమానులు ఇప్పటికే రూమర్ టైటిల్స్‌తో సినిమాల గురించి చర్చించుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు