Tollywood: ఈ స్టార్ హీరోల మేనల్లుళ్లు టూ రిచ్ గురూ..!

Tollywood.. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వారసత్వాన్ని కొనసాగిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా స్టార్ హీరోల కొడుకులే కాదు వారి మేనల్లుళ్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి దూసుకుపోతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోల మేనల్లుళ్లు వారి ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే మేనల్లుళ్ల ఆస్తుల గురించి ఇప్పుడు చూద్దాం.

Tollywood: Nephews of these star heroes are too rich..!
Tollywood: Nephews of these star heroes are too rich..!

సాయి ధరమ్ తేజ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మేనల్లుడు అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు. మెగా మేనల్లుడి గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి ధరంతేజ్ కి మొదట ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సూపర్ హిట్ విజయాలు అందుకున్న ఈయన అలా సొంతంగా సినిమాలలో నటించి సంపాదించిన డబ్బుతో రెండు లగ్జరీ కార్లు , సొంత ఇల్లు కొనుగోలు చేశారు. అంతేకాదు మొత్తం ఈయన దగ్గర రూ.75 కోట్ల ఆస్తి ఉంది. దీనికి తోడు చిరంజీవి తన సోదరి విజయదుర్గ కి కోకాపేటలో వందలకోట్ల విలువ చేసే భూమిని రాసిచ్చారు. తల్లి విజయదుర్గ వారసత్వంగా కూడా సాయిధరమ్ తేజ్ కి వందల కోట్ల ఆస్తి ఉందని చెప్పవచ్చు.

నాగచైతన్య..

అక్కినేని నాగచైతన్య నాగార్జున వారసుడైనప్పటికీ విక్టరీ వెంకటేష్ కి మేనల్లుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున ఆస్తి విలువ రూ.5 వేల కోట్ల పైమాటే. దీనికి తోడు నాగార్జున సినిమాలతో పాటూ వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. అలాగే మరొకవైపు వెంకటేష్ సోదరి దగ్గుపాటి లక్ష్మి. కొన్ని వందల కోట్ల ఆస్తులు తన తండ్రి రామానాయుడు నుండి వారసత్వంగా పొందిందట. ఈ నేపథ్యంలోనే తన కొడుకు నాగచైతన్యకు ఆ డబ్బు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన మేనల్లుడిగా రికార్డు సృష్టించారు నాగచైతన్య.

- Advertisement -

సుమంత్..

హీరో సుమంత్ ఎవరో కాదు నాగార్జున సోదరి కొడుకే సుమంత్. హీరోగా కొంతకాలం రాణించారు. సత్యం, గౌరీ లాంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇకపోతే సుమంత్ ఎక్కువగా తన తాత ఏఎన్ఆర్ దగ్గరే పెరిగారు దీనికి తోడు సుమంత్ కి తన తల్లిదండ్రుల నుంచి కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.ఇవే కాకుండా ఏఎన్నార్ బంజారాహిల్స్ లో రూ.100 కోట్ల విలువైన ప్రాపర్టీని సుమంత్ కి రాసిచ్చారట. ఈయన మరణించక ముందే దాని విలువ రూ.100 కోట్లు. ఇప్పుడు చూస్తే దాని విలువ మరింత పెరిగిందని చెప్పవచ్చు.

అల్లు అర్జున్:

చిరంజీవి సతీమణి సురేఖ మేనల్లుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా ఉన్న ఈయన పుష్ప 2 సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోనున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ తన సంపాదించిన డబ్బు, తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల విలువ రూ.600 కోట్ల పైమాటే. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ఈయన అతి త్వరలోనే వేలకోట్ల ఆస్తి ఉన్న హీరోల జాబితాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు