Tollywood : విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న నిర్మాత.. కూతుళ్ళ విషయంలో మాత్రం ఇలా చేసాడు?

Tollywood : టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి హవానే నడుస్తుంది. గత గురువారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ దుమ్ములేపుతుంది. ప్రభాస్ సహా భారీ పాన్ ఇండియా తారాగణం నటించిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి టాక్ తెచ్చుకోగా, ఈ సినిమాను నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. బడా నిర్మాత అయిన అశ్విని దత్ కూతుళ్లు ప్రియాంకా దత్, స్వప్న దత్ ఈ సినిమాని నిర్మించారు. అయితే టాలీవుడ్ (Tollywood) లో బడా నిర్మాతలంటే దిల్ రాజు, నాగవంశీ, అల్లు అరవింద్ లాంటి పేర్లు ఇప్పుడు గుర్తుకువస్తాయి గాని, ఒకప్పుడు వీళ్లందరికంటే భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాత అశ్వినీదత్. కొడుకులు లేకపోగా, ఇప్పుడు తన సినిమా నిర్మాణ బాధ్యతలను కూతుళ్ళకి ఇచ్చేసి రిలాక్స్ అయ్యాడు అశ్వినీదత్. ఇక నాగ్ అశ్విన్ స్వయానా అశ్విని దత్ అల్లుడని, అశ్వనీదత్ రెండో కూతురు ప్రియాంక భర్త అనే విషయం ఇప్పటికి కొందరికి తెలీదు. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే మెల్లిగా తెలుస్తుంది. అయితే అశ్వినీ దత్ అల్లుళ్ళ విషయంలో ఓ టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

Tollywood producer Ashwinidat's son-in-laws both are is a different cast

విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న ప్రొడ్యూసర్..

టాలీవుడ్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న నిర్మాతలు కూడా ఉన్న విషయం తెలిసిందే. వాళ్ళు బహిర్గతం చేయకున్నా కొందరి విషయంలో అది తెలిసిపోతూ ఉంటుంది. అలాగే అశ్వినిదత్ కి కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందని అంటుంటారు. ముఖ్యంగా ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. ఆ మధ్య టీడీపీ కోసం సినిమా ఇండస్ట్రీలో అందరికంటే ముందు మద్దతుగా నిలిచినా సెలబ్రిటీ అశ్వినీదత్. అలాగే టిడిపి అలాగే ఆ వర్గం నిర్వహించే చాలా కార్యక్రమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తుంటారు అశ్వినీదత్. అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్వినీదత్ కూతుళ్ళ విషయంలో మాత్రం వేరే విధంగా ఉన్నాడు.

- Advertisement -

అల్లుళ్ళు మాత్రం వేరే క్యాస్ట్…

అయితే అశ్విని దత్ కూతుళ్లను పెళ్లి చేసుకున్న అల్లుళ్లిద్దరూ వేరే క్యాస్ట్ వారు కావడం గమనార్హం. ఈ విషయం షాకింగే అంటున్నారు నెటిజన్లు. అశ్వనీదత్ కూతుళ్లు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అశ్వనీదత్ పెద్ద కూతురు స్వప్న దత్ – ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని 2010లోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్పట్లో ఈ పెళ్ళికి అశ్వినీదత్ ససేమిరా అన్నాడట. కానీ అప్పుడు శక్తి సినిమా షూటింగ్ సమయంలో స్వప్న jr ఎన్టీఆర్ తో ఈ విషయం ప్రస్తావించగా, ఎన్టీఆర్ దగ్గరుండి అశ్వనీదత్‌ ను ఒప్పించారట. అలాగే చిన్న కూతురు ప్రియాంక డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని పెళ్లి చేసుకోగా, ఈ పెళ్లి కూడా తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందట. ఇక నాగ్ అశ్విన్ రెడ్డి క్యాస్ట్ అని టాక్. ఓవరాల్ గా నిర్మాత అల్లుళ్లిద్దరు కూడా వేరే క్యాస్ట్ అని సమాచారం. మరి అంత విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్వనీదత్ తన కూతుళ్ళ విషయంలో మాత్రం తగ్గారని నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు తమ కూతుళ్లు, అల్లుళ్లతో అశ్వినీదత్ సంతోషంగానే ఉన్నారని తెలుస్తుంది. ఇక వీరు నిర్మించిన కల్కి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతుంది. ఇప్పటికే 600 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ సినిమా తొలివారం పూర్తయ్యేసరికి ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు