Chiranjeevi : చిరంజీవి వల్ల ఇరకాటంలో పడ్డ మొత్తం ఇండస్ట్రీ… ఇప్పుడు ఏం చేస్తారు..??

Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరుకు పరిచయాలు అవసరం లేదు..స్వయం కృషితో పైకొచ్చిన హీరో.. ఒకమాటలో చెప్పాలంటే కష్ట జీవి.. ఇంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నా కూడా సాధారణంగా ఉంటారు.. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న చిరు సమాజంలో జరిగే వాటిపై స్పందిస్తూ సలహాలు ఇస్తుంటారు.. మొన్న బ్లడ్ డొనేట్ చేసేవారి సంఖ్య పెరగాలని అవగాహన కల్పించారు.. నిన్న డ్రగ్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ను అందించాడు.. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎం చెయ్యాలంటే ఒక వీడియోను వదిలిన సంగతి తెలిసిందే.. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది..

ఈ వీడియో పై తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.. చిరంజీవి ఆలోచన, ఆయన చెప్పిన సందేశం బాగుందని ఓ కార్యక్రమంలో ప్రశంసల వర్షం కురిపించారు.. అంతేకాదు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరాడు.. సినిమా టిక్కెట్ల ధరలు పెంపు, షూటింగ్ లకు సంబందించిన పర్మిషన్ల కోసం వచ్చే నిర్మాతలు, సినీ హీరోలకు ఒక కండిషన్ పెట్టాడు.. చిరంజీవిలాగా డ్రగ్స్ నిర్మూలన గురించి రెండు నిమిషాల వీడియోలను హీరోలు, నటులచేత చెప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కండిషన్ పెట్టాడు..

Tollywood producers who were booked against Chiranjeevi's work
Tollywood producers who were booked against Chiranjeevi’s work

ఈ వార్త సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. సినీ పెద్దలను మొత్తానికి చిరు ఇరకాటంలో పడేసాడు.. రానున్న రోజుల్లో దసరా, దీపావళికి వరుసగా స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి.. విడుదలకు తెలంగాణ సర్కార్ నుంచి పర్మిషన్ కావాలంటే మాత్రం ముఖ్యమంత్రి పెట్టిన కండిషన్ ను ఒప్పుకోవాల్సిందే.. సినిమాలోని హీరోలు, ప్రముఖులతో వీడియో చెయ్యాల్సిందే.. అయితే సినిమా విడుదలయ్యే వరకు అదే హడావుడిలో ఉంటున్న టీమ్ ఈ వీడియోలను ఎలా చేస్తారు? అన్నది ప్రశ్న్తార్ధకంగా మారింది.. మరి దీనిపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. ప్రస్తుతం చిరు సినిమాల విషయానికొస్తే.. విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు