Tollywood: దర్శక నిర్మాతల సెంటిమెంట్..సినిమా చెట్టు కూలిపోయింది..!

Tollywood.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ఫాలో అయితే కచ్చితంగా తమ సినిమాల హిట్ అవుతాయి అన్నది అందరి భావన. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లకే కాదు హీరోలకి నిర్మాతలకు, హీరోయిన్లకి కూడా ఉన్న ఏకైక సెంటిమెంట్ ఒక చెట్టు. ఈ చెట్టు దగ్గర ఒక్క సన్నివేశమైనా తీసి తమ సినిమాలో పెట్టుకుంటే కచ్చితంగా సినిమా 100 డేస్ ఆడుతుంది అనేది దర్శకనిర్మాతల నమ్మకం. అందుకే 1975 మొదలుకొని నేటి వరకు తీసిన ఎన్నో సినిమాలలో ఈ చెట్టు మనం చూసే ఉంటాం. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ చెట్టు తాజాగా కూలిపోయినట్లు గ్రామస్తులు వెల్లడించారు . ఈ చెట్టు కూలిపోయేసరికి సినీ దర్శక నిర్మాతలే కాదు , ఆ ఊరి ప్రజలు, ప్రకృతి ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Tollywood: Sentiment of the director producers..The movie tree has fallen..!
Tollywood: Sentiment of the director producers..The movie tree has fallen..!

సినిమా ఇండస్ట్రీ తో విడదీయరాని బంధం..

1975లో విడుదలైన పాడిపంటలు సినిమాను మొదలుకొని మొన్న సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా వరకు ఈ చెట్టు ఒక ఐకాన్ సింబల్ . మూగమనసులు, పద్మవ్యూహం, సీతారామయ్యగారి మనవరాలు, త్రిశూలం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చిత్రాలలో మనకు ఈ చెట్టు కనిపించింది. దర్శకులు వంశీ , జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావు, కే విశ్వనాథ్ వంటి దిగ్గజ దర్శకులకు ఈ చెట్టు ఒక ఫేవరెట్ స్పాట్ అని చెప్పవచ్చు. దాదాపు 150 సంవత్సరాల వయసు ఉన్న ఈ చెట్టు చుట్టూ దాదాపు 300 సినిమాల షూటింగ్ లు జరగడం గొప్ప విశేషం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా దర్శకుడు వంశీ అయితే ఏకంగా తన స్నేహితులతో కలిసి ఈ చెట్టు కింద భోజనం చేసేవారట. దీన్ని బట్టి చూస్తే సినీ ఇండస్ట్రీకి ఈ చెట్టుకి ఎంత అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.

సినిమా చెట్టు కూలిపోయింది..

ఇంతటి పేరున్న ఈ మహావృక్షం నేడు కూలిపోయింది. దీంతో స్థానికులు, ప్రకృతి ప్రేమికులు, సినీ సెలబ్రిటీలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరింతకు ఈ చెట్టు ఎక్కడుంది అనే విషయానికి వస్తె. .తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండేది.ఈ చెట్టు కూలిపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

- Advertisement -

ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు..

కుమారదేవం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ.. మా ఊరికి ఇంత పేరు వచ్చింది అంటే దానికి కారణం ఈ మహావృక్షమే. దాదాపు 150 సంవత్సరాలు వయసున్న ఈ మహావృక్షం కింద ఎన్నో చిత్రాలు చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ చెట్టు కింద ఒక్క సన్నివేశమైనా తీసి తమ సినిమాలో పెట్టుకుంటే వంద రోజులు ఆడుతుంది అనే నమ్మకం దర్శక నిర్మాతలకు ఉండేది. ఈ చెట్టు నాటింది సింగలూరి రంగరామ గారి తండ్రి గారు. నాడు నాటిన ఈ చెట్టు మహావృక్షంగా మారి మా ఊరికి ఎనలేని గౌరవాన్ని , గుర్తింపును తీసుకొచ్చింది. ఇంతటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన చెట్టు రాత్రి 9:30 సమయంలో వయసు పైబడిన క్రమంలో మరి ఏం జరిగిందో తెలియదు కానీ సగం చెట్టు విరిగి కింద పడింది. ఈ విషయం తెలుసుకోగానే ఊరు ఊరంతా చెట్టు దగ్గరకు వచ్చి మరింత దిగ్భ్రాంతికి గురయ్యాము. ఎందుకంటే మా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఈ చెట్టును మేము ఆదరించాము. విరిగిన సగం చెట్టునైనా ఎలాగోలా కాపాడుకోవాలి అనుకున్నాం. కానీ ఉదయం కల్లా చెట్టు పూర్తిగా నేలమట్టం అయిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు