Love Mouli movie: నవదీప్ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరో

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది చాలా కష్టపడి.. ఇండస్ట్రీలో రాణిస్తుంటే… మరి కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో దూసుకువెళ్తారు. అయితే ఇండస్ట్రీలో చాలా కష్టపడి వచ్చిన హీరోలలో నవదీప్ ఒకడు.

తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు నవదీప్. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కుపోయి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నవదీప్. చాలా రోజుల గ్యాప్ తర్వాత లవ్ మౌలి అనే సినిమాతో రాబోతున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల జూన్ 7వ తేదీకి రిలీజ్ డేట్ ను ఫైనల్ చేస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అలాగే టీజర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కీలకపాత్రలో కనిపించనున్నారట. అది కూడా అఘోర పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

- Advertisement -

Love Mouli Movie | నవదీప్ 'లవ్ మౌళి'లో రానా.!-Namasthe Telangana

దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ… రానా విషయాన్ని చాలా సస్పెన్స్ గా ఉంచాలి అని అనుకున్నామని తెలిపింది. థియేటర్లో… సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు అందరూ త్రిల్ అయ్యేందుకు ఈ విషయాన్ని రివిల్ చేయలేదు అని తెలిపింది. కాగా ఈ సినిమాలో పంకూరి గిద్వాని హీరోయిన్గా నటిస్తోంది. అవనీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్ అలాగే శ్రీకర స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా వస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు