Tollywood Stars: రూ.కోట్లు ఇచ్చినా ఆ పనికి దూరం.. ఫ్యాన్స్ ఫిదా..!

Tollywood Stars..సినిమా ఇండస్ట్రీ అంటేనే లగ్జరీ లైఫ్.. డబ్బు సంపాదించడానికే ప్రాధాన్యత ఇస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు.. డబ్బు ఇస్తే ఎలాంటి పనైనా చేసేవారు ఉన్నా..కానీ తీసుకున్న ప్రతి రూపాయి కూడా చాలా కష్టంతో కూడిన పనిలా ఉండాలని భావించే సెలబ్రిటీలు కూడా ఉంటారు. మరి కొంతమంది ఇష్టంతో పనిచేయాలనుకునే వారు కూడా ఉంటారు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా సరే కొంతమంది హీరోలు వారికి నచ్చని పని మాత్రం అస్సలు చేయరు. మరి ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఏమిటా పనులు..? వాటి గురించి పూర్తిగా ఇప్పుడు చూద్దాం.

Tollywood Stars: Even if they give Rs. Crores, they are far away from the work.. Fans are disappointed..!
Tollywood Stars: Even if they give Rs. Crores, they are far away from the work.. Fans are disappointed..!

మహేష్ బాబు..

ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు విషయానికి వస్తే.. ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారట.. కొన్ని వందల కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇచ్చినా సరే తాను మాత్రం తెలుగు ఇండస్ట్రీని వదిలేసి హిందీలోకి రానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమా కూడా కేవలం తెలుగు నేపథ్యంలోనే తెరకెక్కిస్తూ ఉన్నారు.

జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. తన తాత పోలికలతో ఉండడం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. సీనియర్ ఎన్టీఆర్ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన నటనలో ఏమాత్రం తీసిపోరు.. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా తెలుగు సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు సీనియర్ ఎన్టీఆర్ పాత్ర చేయమని చాలామంది చెప్పినా కూడా అందుకు అర్హుడిని కాదు అంటూ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయట.

- Advertisement -

శోభన్ బాబు..

శోభన్ బాబు విషయానికి వస్తే.. ఎక్కువగా ఈయన హీరో గానే సినిమాలు చేశారు.. అయితే హీరోగా ఫేడ్ అవుట్ అయిన తర్వాత.. సైడ్ క్యారెక్టర్లలో నటించమని చాలామంది సలహా ఇచ్చారట.. అంతేకాకుండా ఎంతోమంది దర్శక నిర్మాతలు కూడా కొన్ని సినిమాలలో ప్రత్యేక పాత్రలు చెప్పినా.. చేయడానికి ఇష్టపడలేదట శోభన్ బాబు.. అందుకు కారణం తనని అభిమానులు సినిమాలలో నటించేటప్పుడు హీరో గానే చూశారు. కానీ డబ్బు కోసం సైడ్ క్యారెక్టర్లలో లేదా వయసు పైబడిన పాత్రలలో మాత్రం చేయలేను అంటూ తెలియజేశారట.

ప్రభాస్..

ప్రభాస్ విషయానికి వస్తే.. బాహుబలి సినిమా ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రభాస్.. దీంతో నేషనల్ బ్రాండ్స్ సైతం వరుసగా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా.. ప్రభాస్ వాటన్నిటిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కెరియర్ లో ఎప్పుడూ కూడా యాడ్స్ లేదా బ్రాండ్స్ ను అసలు ప్రమోట్ చేయరు.

ఇలా కొంతమంది హీరోయిన్లు తమ జీవితంలో పెట్టుకున్న కమిట్మెంట్స్ కారణంగా కోట్ల రూపాయల డబ్బు ఇచ్చినా సరే వాటిని చేయడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు