Tollywood Stars in Gossip: ఎఫైర్స్ కారణంగా రూమర్స్ లో చిక్కుకున్న స్టార్స్..!

Tollywood Stars in Gossip: ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలిశారంటే చాలు వారిద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్ తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ సెట్ పై కుదిరింది అంటే దర్శకనిర్మాతలు ఆ కాంబినేషన్ ను పలు సినిమాలలో రిపీట్ చేస్తూ ఉంటారు.. ఒక హీరోయిన్ హీరో రెండేసి సినిమాలు చేశారు అంటే కచ్చితంగా వారి మధ్య ఏదో ఉందనే వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అలా తమ మధ్య ఏమీ లేకపోయినా ఈ ఎఫైర్ కారణంగా రూమర్స్ లో చిక్కుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఇలాంటి ఎఫైర్స్ ఎక్కువే అని చెప్పాలి. ఇకపోతే ఇలాంటి ఎఫైర్స్ కొన్ని నిజమైతే మరికొన్ని రూమర్స్ కానీ మిగిలిపోతాయి. ఇంకొన్ని నిజాలు ఉన్నా.. సాక్షాలు ఉండవు.. ఈ క్రమంలోనే పెళ్లయిన హీరోలతో ఎఫైర్లు నడిపిన హీరోయిన్ల గురించి.. ఇలా ఎఫైర్ రూమర్స్ లో చిక్కుకున్న స్టార్ సెలబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం..

Tollywood Stars in Gossip: Stars caught in rumors due to affairs..!
Tollywood Stars in Gossip: Stars caught in rumors due to affairs..!

అక్కినేని నాగచైతన్య:

అక్కినేని వారసుడిగా స్టార్డం సంపాదించుకున్నారు అక్కినేని నాగచైతన్య.. కానీ హీరోగా సాలిడ్ సక్సెస్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే తాజాగా తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఇది ఇలా ఉండగా నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.. ఇక విడాకుల తర్వాత హీరోయిన్ శోభితతో రిలేషన్ లో ఉన్నాడని మీడియా కూడా కోడై కూసింది. వీరిద్దరూ కలిసి తిరిగిన ఫారిన్ ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ వీరు మాత్రం అఫీషియల్ గా ఓపెన్ అవ్వలేదు.

అక్కినేని నాగార్జున:

నవమన్మధుడిగా ఇప్పటికీ అంతే అందంతో అమ్మాయిల హృదయాలను దోచుకుంటున్న అక్కినేని నాగార్జున.. దగ్గుబాటి వారసురాలు లక్ష్మీని వివాహం చేసుకొని నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్న ఆ తర్వాత అమలాను వివాహం చేసుకున్న ఈయన అఖిల్ కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈయనకు హీరోయిన్ టబుతో ఎఫైర్ రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. నాగార్జున మాత్రం అవన్నీ పట్టించుకోమని.. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని తెలిపారు.. ఇకపోతే నాగార్జున కోసమే నటుడు ఇప్పటికి వివాహం చేసుకోలేదని.. పెళ్లి దాకా వచ్చి వీరి బంధం బ్రేకప్ అయ్యిందని చెబుతున్నారు.మొత్తానికి అయితే పదేళ్లుగా వీరిద్దరూ రహస్య బంధంలో ఉన్నారని రూమర్లు మాత్రం వినిపిస్తూ ఉంటాయి.

- Advertisement -

ప్రభుదేవా:

కొరియోగ్రాఫర్ , డైరెక్టర్ హీరో ప్రభుదేవా గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పెళ్లైన ఈయన నయనతారతో రిలేషన్ మెయింటైన్ చేశారు.. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ ప్రభుదేవా మొదటి భార్య అడ్డుకోవడంతో వీరి బంధం ప్రేమ వరకే ఆగిపోయింది. ఇక అటు నయనతార, విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది.

ధనుష్:

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను వివాహం చేసుకున్నారు.. 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు.. దీనికి కారణం ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ అని.. ధనుష్ తో ఎఫైర్ ఉందని. అందుకే వీరిద్దరూ విడిపోయారని సమాచారం.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ధనుష్ నుంచి ఆయన భార్య విడాకులు తీసుకుంది..

ఇక వేరే కాకుండా కమల్ హాసన్, సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి ఇలా కొంతమంది పేర్లు వైరల్ గా నిలిచాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు