Tollywood: మరదళ్లనే పెళ్లి చేసుకున్న స్టార్స్.. సూపర్ జోడీలు భయ్యా..!

Tollywood.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు? ఎవరు? ఎవరితో ప్రేమలో పడతారో చెప్పడం కష్టం.. అయితే కొంతమంది తమకు నచ్చిన వారిని ప్రేమించి వివాహం చేసుకుంటే మరి కొంతమంది పెద్దలు కుదిరిచిన వివాహాన్ని చేసుకుంటారు ఇంకొంతమంది సొంత మరదళ్లనే వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలా ఎన్టీఆర్ ను మొదలుకొని.. హీరో కార్తీ వరకు ఇలా చాలామంది మేనమామ కూతుర్లను లేదా మేనత్త కూతుర్లను వివాహం చేసుకున్న వారే.. మరి ఎవరెవరు సినిమా ఇండస్ట్రీలోనీ వారిని కాకుండా సొంత మరదళ్లను వివాహం చేసుకున్నారు.. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Tollywood: Stars who got married for the second time.. Super couples are afraid..!
Tollywood: Stars who got married for the second time.. Super couples are afraid..!

అక్కినేని నాగేశ్వరరావు:

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరో పొజిషన్ కు చేరుకున్న తర్వాత ఏఎన్ఆర్ కి పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి.. అయితే వాటన్నింటినీ పక్కనపెట్టి తన సొంత మరదలు అయిన అన్నపూర్ణను 1949లో వివాహం చేసుకున్నారు. ఆమె పేరు మీదే సినిమా స్టూడియో ని కూడా నిర్మించారు అక్కినేని నాగేశ్వరరావు.. ఈయన వారసులు నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా కొనసాగురతున్నారు. అలాగే నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్ కూడా సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు.

నందమూరి తారక రామారావు:

సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే తన సొంత మరదలైన బసవతారకం ను వివాహం చేసుకున్నారు నందమూరి తారకరామారావు.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సినీ పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచి.. ఆ తర్వాత రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సినిమాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ:

కృష్ణ కూడా తన సొంత మరదలైన ఇందిరా దేవిని 1961 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు హీరోగా ఈయన నటించిన మొదటి సినిమా విడుదలైంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు పాన్ వరల్డ్ మూవీ కోసం సిద్ధమవుతున్నారు.

కలెక్షన్ కింగ్ మంచి మోహన్ బాబు..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మొదటి భార్య చనిపోవడంతో దాసరి నారాయణరావు కోరిక మేరకు మొదటి భార్య చెల్లెలు విద్యాదేవిని వివాహం చేసుకున్నారు.. ఇక సినీ ఇండస్ట్రీలో, రాజకీయాలలో జరగని ముద్ర వేసుకున్నారు మోహన్ బాబు.. అంతే కాదు ప్రత్యేకంగా విద్యాసంస్థలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఆది సాయికుమార్..

ఆది సాయికుమార్ సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖ హీరో సాయికుమార్ వారసుడిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈయన కూడా తన మేనమామ కూతురైన అరుణను 2004లో వివాహం చేసుకున్నారు. అండర్ 19 క్రికెట్ ఆడిన ఆది ఆ తర్వాతనే సినిమాల్లోకి వచ్చారు.

హీరో కార్తీ:

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తన సొంత మరదలైన రజిని వివాహం చేసుకున్నారు. ఇక వీరంతా కూడా సొంత మరదళ్లను వివాహం చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. మొత్తానికైతే కుటుంబాలకు కూడా వీరు ప్రాముఖ్యత ఇవ్వడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు