Tollywood : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నేడే… గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందంటే?

Tollywood : టాలీవుడ్ లో మళ్ళీ ఎన్నికల వాతావరణం మొదలైంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి “తెలుగు ఫిల్మ్ ఛాంబర్” ఎన్నికలు నేడే జరగనున్నాయి. ఈ సందర్బంగా నిన్నటి నుండే పలువురు అగ్ర నిర్మాతలు టెక్నిషియన్స్ ఇండస్ట్రీలో సందడి చేసారు. ఇక ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షడి ఎన్నికల కోసం ఇద్దరు ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ఇంతకు ముందు టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు అధ్యక్షుడిగా పనిచేసారు. ఇక ఈ నెల 31తో దిల్ రాజు (ప్రొడ్యూసర్ సెక్టార్) పదవి కాలం ముగుస్తుంది. కాగా ఇప్పుడు జూలై 28న అనగా నేడే అధ్యక్ష పదవి కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికలు జరుగనున్నాయి.

Tollywood Telugu Film Chamber Elections Today

అధ్యక్ష్య పదవి కోసం బరిలో నిలిచింది వీరే!

ఇక గత ఐదేళ్ల పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యవహరించగా, ఈసారి ఇద్దరు నిర్మాతలు పోటీలో నిల్చున్నారు. ఈసారి అధ్యక్ష పదవికి (డిస్ట్రిబ్యూషన్ సెక్టార్) ప్రముఖ నిర్మాతలు భరత్ భూషణ్, అలాగే ఠాగూర్ మధు పోటీ పడనున్నారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ లో డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని సభ్యులు ఎన్నుకోనున్నారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, అలాగే దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి పోటీపడనున్నారు. ఉదయం 11 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు మొదలుకానున్నాయి. ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మొత్తం 48 ఓట్లు ఉండగా, మెజారిటీ మార్క్ 25 ఎవరికి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా గెలిచినట్టు. ఇక ఈ ఓట్లలో మిగతా విభాగాలను చూస్తే ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ విభాగంలో 16 మంది సభ్యులుగా, ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో 12 మంది, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో 12 మంది, స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ లో 4 గురు, సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు మరో4 ఉన్నాయి. మొత్తం కలిపి 48 ఓట్లు ఉన్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్న ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ లోని సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

- Advertisement -

గెలిచే అవకాశం వీరికే!

అయితే అధ్యక్ష బరిలో పోటీ చేస్తున్న నిర్మాతలలో భరత్ భూషణ్, ఠాగూర్ మధు ఇద్దరూ ఇండస్ట్రీలో పేరున్న వారే కాగా, ఎక్కువగా ఠాగూర్ మధు గెలిచే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఉపాధ్యక్షుడిగా వైవిఎస్ చౌదరి గెలిచే అవకాశం ఉంది. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు కూడా నేడు సాయంత్రమే ప్రకటించే అవకాశం ఉంది. లేదా రేపు ఉదయం ప్రకటించవచ్చు. మరి ఈ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో గెలిచేదెవరో అని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు