Tollywood Tier 2 heroes: మొత్తానికి టైర్ 2 హీరోల ముగ్గురు ఆ గెటప్ ట్రై చేసినట్టే

Tollywood Tier 2 heroes: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే వీరిద్దరికి ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటికీ వీళ్ళ సినిమాలు రీ రిలీజ్ అయితే థియేటర్ వద్ద ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. అసలైన పోటీ కూడా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మధ్య మాత్రమే ఉంటుంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోస్ ని వదిలేస్తే ఇప్పుడు అంతా కూడా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మానియా మాత్రమే. ఇక టైర్ వన్ హీరోలుగా పేరు సాధించిన అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ప్రస్తుతం వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించారు.

Ram Pothineni

ఈ హీరోలలో ఒక అల్లు అర్జున్ మినహాయిస్తే మిగతా హీరోలు అందరికీ కూడా స్టార్డం తీసుకొచ్చింది ఎస్ఎస్ రాజమౌళి. చత్రపతి అనే సినిమాతో ప్రభాస్ ఒక స్టార్ హీరోగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. మగధీర సినిమాతో స్టార్ హీరోగా రామ్ చరణ్ నిలబడ్డాడు. ఇంకా ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలు ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ ప్లస్ గా మారాయి. ఒక ప్రస్తుతం ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబుతో రాజమౌళి సినిమాను చేయనున్నారు.

- Advertisement -

ఇక ప్రస్తుతం టైర్ టు హీరోల విషయానికి వస్తే. నాని, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ పేర్లు వినిపిస్తాయి. వీళ్ళు ముగ్గురుకు ఇప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడిప్పుడే మిగతా ఇండస్ట్రీలో కూడా వీళ్లు మంచి గుర్తింపును సాధించుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముగ్గురు కూడా ఒక గెటప్ ను ట్రై చేశారు అని చెప్పాలి. ఈ గెటప్ ని ట్రై చేసిన ఇద్దరు హీరోలకి ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కి ఎలా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

Janda Pai Kapiraju

విజయ్ దేవరకొండ గౌతమ్ దర్శకత్వంలో 12వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి విజయ్ లుక్ ఒకటి లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లుక్ లో విజయ్ చాలా షార్ట్ హెయిర్ తో గడ్డంతో కనిపించాడు. ఇది చూడడానికి చాలా అందంగా అనిపించింది చాలామంది విజయ్ ఫ్యాన్స్ కి. ఇదే లుక్ ను జెండాపై కపిరాజు అనే సినిమాలో నాని ట్రై చేశాడు. అలానే రెడ్ అనే సినిమాలో రామ్ పోతినేని కూడా ట్రై చేసాడు. ఇప్పుడు విజయ్ ఇలా కనిపిస్తున్నాడు వారిద్దరికీ వర్కౌట్ కానీ ఆ లుక్ ఇప్పుడు విజయ్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు