Tollywood : ఏ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?

సమ్మర్ చప్పగా సాగిపోతుంది అని అనుకుంటుంటే మరోవైపు ఎలక్షన్ ఎఫెక్ట్ అంతకంటే గట్టిగానే కొడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఎలక్షన్స్ ఫీవర్ పట్టుకుంది. ఆ సెగ టాలీవుడ్ కు తగలడంతో పెద్ద హీరోలు మినహా చాలామంది యంగ్ హీరోలు హ్యాపీగా షూటింగులు మానేసి రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఇంతకీ ప్రస్తుతం ఏ హీరో ఏ ఎక్కడ ఉన్నారు? ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

1. పుష్ప 2
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 షూటింగ్ శరత్ వేగంగా జరుగుతుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి పుణ్యక్షేత్రంలో షూటింగ్ జరుపుకుంటుంది. యాగంటి గుహల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి హీరోయిన్ రష్మిక మందన్న బంగారు కిరీటాన్ని బహూకరించే సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి లొకేషన్ లో రష్మిక ఉన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం వైజాగ్ పోర్టులో రెండు రోజులపాటు “పుష్ప 2” షూటింగ్ జరిపారు మేకర్స్.

2. గేమ్ ఛేంజర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఇప్పటికే లొకేషన్ నుంచి షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అయిన విషయం తెలిసిందే.

- Advertisement -

3. బాలయ్య, బాబి మూవీ
నటసింహం నందమూరి బాలయ్య, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఎలక్షన్స్ హడావిడి నడుస్తున్నప్పటికీ బాలయ్య ఒకవైపు టిడిపి ప్రచార సభల్లో పాల్గొంటూనే, మరోవైపు షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు.

4. కల్కి
ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి” షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లిలో జరుగుతోంది. రీసెంట్ గా ఇటలీలో మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ ఇప్పుడు శంకరపల్లిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న “రాజా సాబ్ “కు కూడా ప్రభాస్ డేట్స్ ఇచ్చారు.

5. రాబిన్ హుడ్
యంగ్ హీరో నితిన్ కొత్త మూవీ “రాబిన్ హుడ్” షూటింగ్ కూడా బ్రేకులు లేకుండా జరుగుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీ షూటింగ్ ప్రస్తుతం నాంపల్లిలో జరుగుతోంది.

6. శర్వానంద్ కొత్త మూవీ
సామజవరగమన ఫేమ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు, యంగ్ హీరో శర్వానంద్ కాంబోలో కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కోటిలో జరుగుతున్నట్టు సమాచారం.

7. తండేల్
అక్కినేని నాగచైతన్య కొత్త చిత్రం “తండేల్” షూటింగ్ ప్రస్తుతం బీహెచ్ఈఎల్ లో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పాకిస్తాన్ జైలు సెట్ వేసి, అందులోనే సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

8. సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం సరిపోదా శనివారం కొత్త షెడ్యూల్ కూడా బీహెచ్ఈఎల్ లోనే జరుగుతుండడం విశేషం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు