Tollywood: టాలీవుడ్ యంగ్ హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ ఎవరికంటే..?

Tollywood.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వుండే యంగ్ హీరోలు అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటూ బిజీగా దూసుకుపోతున్నారు.. ఈ క్రమంలోనే వాళ్ళు స్టార్ హీరోలతో కూడా పోటీపడే రేంజ్ కి ఎదిగిపోయారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.. అందుకే చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారు.. అలాంటి వారిలో హనుమాన్ హీరో తేజ సజ్జ , సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలు అందరూ ఈ జాబితాలోకే వస్తారు..

Tollywood: Who is the highest remuneration among Tollywood young heroes..?
Tollywood: Who is the highest remuneration among Tollywood young heroes..?

ఈ క్రమంలోనే చిన్న సినిమాగా వచ్చి సంక్రాంతి బరిలో నిలిచి పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టేసింది తేజ సజ్జ మూవీ హనుమాన్.. .. రీసెంట్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా భారీ సక్సెస్ ను అందుకుంది. అందులో భాగంగానే ఆయన మరిన్ని అవకాశాలతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా తేజ సజ్జ , సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలతో భారీ గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు భారీగా రెమ్యూనరేషన్ ను కూడా పెంచేసినట్టు తెలుస్తోంది.. ఈ ముగ్గురు యంగ్ హీరోలు కూడా మంచి విజయాలు అందుకొని.. ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నారనే చెప్పాలి.. కాబట్టి ఇకమీదట రాబోయే సినిమాల కోసం భారీ రేంజ్ లో పారితోషకం తీసుకోబోతున్నారని వార్తలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి..మరి ఈ యంగ్ హీరోలు రెమ్యూనరేషన్ ఎంత..? ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

సిద్దు జొన్నలగడ్డ..

తెలుగులో టిళ్ళు సినిమాకి ముందు వరకూ సిద్దు ఒక్కో సినిమాకి 5 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకునేవారు.. కానీ ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో ఏకంగా ఒక్కో సినిమాకు రూ.15 నుంచీ రూ.20 కోట్ల వరకు తీసుకుంటున్నారు.. మొత్తానికి అయితే టిల్లు స్క్వేర్ మూవీ సిద్దు జొన్నలగడ్డకు భారీగా క్రేజ్ సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు.

తేజ సజ్జ..

హనుమన్ సినిమాతో మంచి విజయాన్ని సాధించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకి రూ.25 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తేజ సజ్జ చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వక్ సేన్..

ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించి పేరు కూడా దక్కించుకున్నారు.. కాబట్టి తన రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు రూ.20 కోట్లకు పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో మూవీకి రూ .15 నుంచి రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఏదిఏమైనా ఈ యంగ్ హీరోలు అందరూ తమ సినిమాలతో భారీ ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాదు టైర్ 2 హీరో ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ దూసుకుపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు