Tollywood: తల్లీకూతుర్లతో రొమాన్స్ చేసిన స్టార్ హీరో ఎవరంటే..?

Tollywood.. సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ డిమాండ్ చేసింది అంటే ఎవరు ఎలాంటి పాత్రలోనైనా చేయాల్సిందే. ఎవరు ఎవరితోనైనా రొమాన్స్ చేయాల్సిందే. అప్పుడే కథ అద్భుతంగా పండి , తెరపై ఆ పాత్రకు మంచి గుర్తింపు వస్తుంది. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హీరోలు తల్లీ కూతుర్లతో లేదా హీరోయిన్ తండ్రి కొడుకులతో కూడా రొమాన్స్ చేయాల్సిన పరిస్థితిని వస్తూ ఉంటాయి. ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమన్న , కాజల్ లాంటి హీరోయిన్స్ అటు చిరంజీవితో ఇటు రాంచరణ్ తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. అలా హీరోయిన్స్ తండ్రి కొడుకులతో రొమాన్స్ చేశారు. కానీ హీరోలు తల్లి కూతుర్లతో రొమాన్స్ చేసిన రోజులు లేవనే చెప్పాలి. కానీ ఇక్కడ ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ మాత్రం తల్లి కూతుర్లతో రొమాన్స్ చేసిన ఏకైక టాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించారు. మరి ఆయన ఎవరు .. ?ఆ తల్లీ కూతుర్లు ఎవరు..?ఆ చిత్రాలు ఏంటి..?అనేది ఇప్పుడు చూద్దాం.

Tollywood: Who is the star hero who had romance with mother and daughter?
Tollywood: Who is the star hero who had romance with mother and daughter?

తల్లీ కూతుర్లతో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్..

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి తరం వాళ్ళలో సారిక (Sarika)- శృతిహాసన్(Shruti Hassan), శ్రీదేవి(Sridevi )- జాన్వి కపూర్(Janhvi Kapoor)ఇలా చాలామంది తల్లి కూతుర్లు హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో కూడా ఇలా తల్లి కూతుర్లు సినిమాలలో నటించారు. అలాంటివారిలో ముందుగా చెప్పుకోవాల్సిన వారు జయా శ్రీ అలియాస్ అమ్మాజీ(Ammaji )- జయచిత్ర(Jaya chitra).. వీళ్లు మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. జయచిత్ర తల్లి అమ్మాజీ తమిళ చిత్రం మహావీరన్ , తెలుగు చిత్రాలలో రోజులు మారాయి, దైవ బలం వంటి చిత్రాలలో నటించింది. అయితే ఈ ఇద్దరితో సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR ) రొమాన్స్ చేసి ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. తల్లి కూతుర్లతో కలిసి నటించిన ఏకైక హీరో కూడా ఈయనే కావచ్చు.

కూతురు జయ చిత్రాతో 1976లో రొమాన్స్..

జయ చిత్ర 1976లో వచ్చిన మా దైవం (Maa Daivam)అనే సినిమాతో మొదటిసారి ఎన్టీఆర్ తో జతకట్టింది. హిందీలో హిట్ అయిన దో ఆంఖే బారా హాథ్ సినిమాకి రీమేక్ మా దైవం. ఈ సినిమాను ఉదయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విద్యా లక్ష్మణ్ నిర్మించగా, ఎస్ఎస్ బాలన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఇందులో జయచిత్ర సరోజా అనే పాత్ర పోషించిన ఆ పాత్రలో ఆమె వీధుల్లో తిరుగుతూ వస్తువులను అమ్ముకుంటుంది. రామారావు జైలర్ పాత్రలో కనిపిస్తూ.. నేరస్తులను మంచి వాళ్లను చేయవచ్చు అని ఆయన నమ్ముతారు.. అంతేకాదు నేరాలు చేసిన వారిని జైలుకు తీసుకొచ్చి వారిని మంచి వారిని చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతూ ఉంటారు.

- Advertisement -

తల్లి జయశ్రీ తో 1959 లో ఎన్టీఆర్ రొమాన్స్..

ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ , జయచిత్రతో రొమాన్స్ చేశారు. అయితే ఈ సినిమా కంటే ముందు అంటే 1959లో దైవబలం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయ చిత్రా తల్లి జయశ్రీ అలియాస్ అమ్మాజీ తో ఎన్టీఆర్ జతకట్టారు. ఈ సినిమాని పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి నిర్మించగా ఆయనే దర్శకత్వం కూడా వహించారు. ఇది తెలుగు సినిమాల్లో ఈస్ట్ మన్ కలర్ అనే కొత్త రకం కలర్ ఫోటోగ్రఫీ ని మొదటిసారి ఉపయోగించిన చిత్రాలలో కూడా ఒకటి కావడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు