HBD JaniMaster : జానీ మాస్టర్ ని స్టార్ కొరియోగ్రాఫర్ గా మలిచిన టాప్ సాంగ్స్ ఇవే!

HBD JaniMaster : టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్లలో ఒకరు “జానీ మాస్టర్”. ఈటివి ఢీ షో లో చిన్న డాన్స్ మాస్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన జానిమాస్టర్ ఆ తర్వాత తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ కొరియోగ్రాఫర్ గా మారాడు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ కొరియోగ్రాఫర్లలో ఒకడిగా నిలిచాడు. టాలీవుడ్ లో ఆల్మోస్ట్ నంబర్ వన్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టరే అని చాలామంది ఆడియన్స్ అంటుంటారు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ బర్త్ డే (జులై2) నేడు. కెరీర్ ఈ సందర్బంగా జానీ మాస్టర్ (HBD JaniMaster) కెరీర్ కి టర్న్ చేసిన టాప్ సాంగ్స్ పై ఓ లుక్కేద్దాం.

Top 5 Best Songs Choreographed by HBD JaniMaster

జాని మాస్టర్ కెరీర్ బిగినింగ్ లో సినిమాల్లో హీరోల వెనుక సైడ్ డాన్సర్ గా పని చేసిన జానీ, ఈ క్రమంలో ఢీ (2007) షో లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ టైం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానీ నితిన్ ద్రోణ సినిమాతో పూర్తి స్థాయి కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఆ తర్వాత మర్యాద రామన్న, ప్రేమకావాలి వంటి హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “రచ్చ” సినిమాలో డిల్లకు డిల్లా పాటకు కొరియోగ్రఫీ చేసి స్టార్ డమ్ సంపాదించాడు. ఆ తర్వాత జానీ టాలెంట్ మెచ్చుకున్న చరణ్ తన ప్రతి సినిమాకి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న అందరు స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేసాడు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ కొరియో గ్రఫీ చేసిన టాప్ బెస్ట్ సాంగ్స్ ని ఒకసారి గమనిస్తే…

- Advertisement -

1. డిల్లకు డిల్లా (రచ్చ 2012)

రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో డిల్లకు డిల్లా పాట ద్వారానే జానీ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. అంతే కాదు ఈ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు జానీ.

2. లైలా ఓ లైలా (నాయక్ 2013)

రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో ‘లైలా ఓ లైలా’ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన జానీ వరుసగా రెండో ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

3. సినిమా చూపిస్తా మామ (రేస్ గుర్రం2014)

అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రంలో సినిమా చూపిస్తా మామ సాంగ్ కి డాన్స్ కంపోస్ చేసిన జానీ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సినీ “మా” అవార్డు అందుకున్నాడు.

4. టెంపర్ టైటిల్ సాంగ్ (టెంపర్2015)

జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా టైటిల్ సాంగ్ కి జానీ కొరియోగ్రఫీ అందించాడు. దీనికి గాను మరో సారి సైమా అవార్డు అందుకున్నాడు జానీ.

5. సుందరి (ఖైదీ నెం150)

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 మూవీలో సుందరి సాంగ్ కి చిరంజీవి చేత అదిరిపోయే స్టెప్పులు చేయించి జానిమాస్టర్ ప్రశంసలు అందుకున్నాడు. ఈ పాటకి అవార్డు రాకపోయినా, రీ ఎంట్రీ ఇచ్చిన చిరుతో 60ఏళ్ళ వయసులో యంగ్ హీరోల్లా స్టెప్పులు వేయించి జనిమాస్టర్ మార్కులు కొట్టేసాడు.

ఇక ఇవే గాక జులాయి, బాద్ షా, ఎవడు, బ్రుస్ లి ది ఫైటర్, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలకు మంచి డాన్స్ బీట్స్ అందించాడు. అలాగే ఇతర భాషల్లో పునీత్ రాజ్ కుమార్, ధనుష్, సల్మాన్ ఖాన్, శివరాజ్ కుమార్, కార్తీ, సూర్య, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేసాడు జానీ మాస్టర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు