Top Celebrity Tax Player : హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేస్తున్న ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?

Top Celebrity Tax Payer : హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేస్తున్న స్టార్స్ లిస్ట్ తాజాగా బయటకు వచ్చింది. అందులో ఒకే ఒక్క టాలీవుడ్ హీరో పేరు ఉండడం విశేషం. మరి ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? ఆ టాలీవుడ్ హీరో ఎవరు? ఏ ప్లేస్ లో ఉన్నాడు ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేస్తున్న స్టార్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో 7,300 కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కింగ్ ఖాన్ 2024 ఆర్థిక సంవత్సరానికి గాను 92 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టి అత్యధిక పన్ను చెల్లించే భారతీయ సెలబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచారు. ఫార్చ్యూన్ ఇండియా నివేదించిన ప్రకారం అత్యధికంగా పన్నులు చెల్లించే టాప్ 10 సెలబ్రిటీలలో అగ్రగామిగా ఉన్నాడు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో బాలీవుడ్, క్రీడలు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన మరికొంతమంది స్టార్స్ కూడా స్థానాన్ని దక్కించుకున్నారు.

ఖాన్ తర్వాత తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 80 కోట్ల రూపాయల పన్ను చెల్లింపుతో రెండవ స్థానంలో నిలిచాడు. సల్మాన్ ఖాన్ ఈ లిస్ట్ లో మూడవ స్థానంలో నిలిచాడు. పన్నుల రూపంలో ఆయన రూ.75 కోట్లు చెల్లించాడు. అమితాబ్ బచ్చన్ 71 కోట్ల రూపాయల పన్ను కట్టి మూడవ స్థానంలో, కరీనా కపూర్ రూ. 20 కోట్లు పన్నుగా కట్టి 5వ ప్లేస్ లో నిలిచారు. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి స్టార్స్ కూడా హయ్యెస్ట్ ట్యాక్స్ పే చేస్తున్న సెలబ్రిటీల లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు.

- Advertisement -

టాప్ 20 సెలబ్రిటీ పేయర్స్ లిస్ట్

  1. షారూఖ్ ఖాన్ – రూ 92 కోట్లు
  2. తలపతి విజయ్ – 80 కోట్లు
  3. సల్మాన్ ఖాన్ – 75 కోట్లు
  4. అమితాబ్ బచ్చన్ – 71 కోట్లు
  5. విరాట్ కోహ్లీ – 66 కోట్లు
  6. ఎంఎస్ ధోని – 38 కోట్లు
  7. రణబీర్ కపూర్ – 36 కోట్లు
  8. అజయ్ దేవగన్ – 42 కోట్లు
  9. సచిన్ టెండూల్కర్ – 28 కోట్లు
  10. హృతిక్ రోషన్ – 28 కోట్లు
  11. కపిల్ శర్మ – 26 కోట్లు
  12. సౌరవ్ గంగూలీ – 23 కోట్లు
  13. కరీనా కపూర్ – 20 కోట్లు
  14. షాహిద్ కపూర్ – 14 కోట్లు
  15. అల్లు అర్జున్ – 14 కోట్లు
  16. మోహన్‌లాల్ – 14 కోట్లు
  17. హార్దిక్ పాండ్యా – 13 కోట్లు
  18. కియారా అద్వానీ – ​​12 కోట్లు
  19. కత్రినా కైఫ్ – 11 కోట్లు
  20. పంకజ్ త్రిపాఠి – 11 కోట్లుAllu Arjun Among Top 20 Highest Taxpayers of 2024 - Telugu News -  IndiaGlitz.com

ఒకే ఒక్క టాలీవుడ్ హీరో

ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకున్న ఒకే ఒక్క స్టార్ హీరో అల్లు అర్జున్. టాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ కోట్లలో సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ దాదాపు 200 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నాడు. ఇక చెర్రీ, తారక్ సైతం భారీ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ విచిత్రంగా అల్లు అర్జున్ మాత్రమే హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆయన 14 కోట్లు ట్యాక్స్ పే చేయగా, ఈ లిస్ట్ లో ఆయన 15 వ స్థానంలో ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు