Tripti Dimri Upcoming Projects : యానిమల్ బ్యూటీ సాలిడ్ లైనప్… ఈ సినిమాలు హిట్టైతే ఆమెను పట్టుకోవడం కష్టమే

Tripti Dimri Upcoming Projects : ఇటీవలి కాలంలో త్రిప్తీ దిమ్రీ నేషనల్ క్రష్ గా మారిపోయింది. యానిమల్ మూవీతో ఆమె గురించి ఎలాంటి వార్త వచ్చిననా క్షణాల్లో వైరల్ అయ్యేంత పాపులర్ అయ్యింది. అందులో కన్పించింది కొన్ని క్షణాలే అయినా ప్రేక్షకులపై ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే పడింది. ఇప్పటికే ఆమె చేసిన మ్యాజిక్ నుంచి తేరుకోలేదు మూవీ లవర్స్. అందుకే ఆమె నెక్స్ట్ మూవీ గురించి క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు త్రిప్తీ మాత్రం సైలెంట్ గా అరడజను సినిమాలను లైన్ లో పెట్టేసింది. ఆ సినిమాల్లో సగం హిట్ అయినా ఈ అమ్మడిని పట్టుకోవడం మేకర్స్ కష్టం అయ్యేంతగా ఎదిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

యానిమల్ తో పాపులారిటీ

యానిమల్ లో తన అందం మాత్రమే కాకుండా తన నటనా నైపుణ్యం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఒక్క మూవీతోనే నేషనల్ క్రష్, బాబీ 2 అంటూ పిలిపించుకున్న త్రిప్తీ ఇప్పుడు మేకర్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. మరి ఆమె లైన్లో పెట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vicky Kaushal, Triptii Dimri and Ammy Virk share 'Bad Newz' with fans, reveal title and release date of their new Dharma film | Bollywood News - The Indian Express

- Advertisement -

బ్యాడ్ న్యూజ్

ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్, అమ్మీ విర్క్‌లతో కలిసి త్రిప్తీ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ హిందీ చిత్రం ఇద్దరు అధునాతన పంజాబీ అబ్బాయిలు, ఒక క్రిస్టియన్-హిందూ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. సినిమాలో ఈ ఇద్దరు అబ్బాయిలలో ఒకరు ఆ అమ్మాయితో వన్ నైట్ స్టాండ్‌లో ఉంటారు. ఊహించని విధంగా ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. జూలై 19న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Kartik Aaryan, Triptii Dimri wrap up first schedule of Bhool Bhulaiyaa 3: 'Small break is gonna make me impatient' | Bollywood - Hindustan Times

భూల్ భూలయ్యా 3

పాపులర్ హారర్-కామెడీ మూవీ మూడవ పార్ట్ థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీ, విద్యాబాలన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. 2024 చివర్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Zee Sets 'Dhadak 2' for November Theatrical Release

ధడక్ 2

ఇటీవలే నిర్మాతలు ధడక్‌ సీక్వెల్ ను ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన టీజర్‌లో సినిమా గురించి పెద్దగా వివరాలు వెల్లడించకుండా, జస్ట్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో త్రిప్తీ హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం నవంబర్ 22న ధడక్ 2 థియేటర్లలో విడుదల కానుంది.

Triptii Dimri says her parents were 'taken aback' by her intimate scenes in Animal: 'They said you shouldn't have done that but…' | Bollywood News - The Indian Express

యానిమల్ పార్క్

సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ మూవీ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్‌లో త్రిప్తీ తన పాత్ర జోయాతో తిరిగి కన్పించనుంది. ఈ విషయం గురించి మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ స్టోరీ ప్రకారం ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంది కాబట్టి సీక్వెల్ లో త్రిప్తీ కన్పించే ఛాన్స్ ఉంది.

Rajkummar Rao Wishes his Vicky Vidya Ka Woh Wala Video Co-star Triptii Dimri on Her Birthday

విక్కీ విద్యా కా వో వాలా వీడియో

రాజ్‌కుమార్ రావ్, త్రిప్తీ డిమ్రీ నటించిన ఈ చిత్రం 90వ దశకంలో విక్కీ, విద్య సన్నిహిత వీడియో VHS టేప్‌, ఒక చిన్న పట్టణంలో జరిగే గందరగోళం చుట్టూ తిరుగుతుంది. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు