Trisha: ఆ ఇద్దరూ హీరోలతో బాగా క్లోజ్‌ అయిన త్రిష ?

Trisha: సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తయినప్పటికీ చెక్కుచెదరని అందంతో ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తూ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సౌత్ ఇండస్ట్రీలోనే బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. తన కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసింది.

నీ మనసు నాకు తెలుసు సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ వర్షం సినిమాతో పాపులర్ అయింది. ఈ చెన్నై బ్యూటీ తెలుగులో కొన్నేళ్లపాటు టాప్ స్టార్ హీరోయిన్గా రాణించింది. అంతేకాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఒకానొక సమయంలో వెలుగు వెలిగింది. ఇక ఇటీవలే తాజాగా త్రిష మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియిన్ సెల్వన్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీకి సంబంధించిన వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. త్రిష ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో దగ్గుబాటి రానాతో ప్రేమలో ఉందనే వార్తలు బయటకు వచ్చాయి.

Star heroine Trisha Krishnan faced big controversies in her career

- Advertisement -

దానికి తగినట్టుగానే వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. పబ్బులు, పార్టీలు అంటూ ఇద్దరూ తెగ హంగామా చేసేవారు. వీరు పెళ్లి చేసుకుంటారని అంత అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు రానా మిహికా బజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకొని తన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉందని వార్తలు వస్తున్నా. విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు