Trisha: పాలిటిక్స్ కి దూరం

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. ఈమె ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి 20 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా అదే తరహాలో క్రేజ్ అందుకుంటుంది. తాజాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో ఆమె పోషించిన కుందవి పాత్ర అభిమానులను మెప్పించడమె కాకుండా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే ఇటీవల త్రిష రాజకీయాలలోకి రాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది.

ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ లో చేరబోతున్నాననే వార్తలు నిజం కాదని.. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక గతంలో దగ్గుపాటి రానా – త్రిష ల మధ్య సుఛీ లీక్స్ అంటూ సెలబ్రిటీ లింకుల గురించి ఫోటోలు బయటికి వచ్చిన సమయంలో వీరి మధ్య కూడా ఏదో ఉందంటూ లీకులు వచ్చాయి.

- Advertisement -

వీటి గురించి త్రిష మాట్లాడుతూ.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళమని.. చెన్నైలో రానా ఇంటి దగ్గరే మా కుటుంబం ఉండేదని తెలిపింది. రానా ఎప్పుడూ ఒక పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాడిలా ఉండడని.. చాలా సింపుల్ గా ఉంటాడని తెలిపింది త్రిష.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు