Trisha: పెళ్లిపై అసలు నిజం బయటకి..!

Trisha: టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ కుర్ర హీరోయిన్లకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ రెమ్యూనరేషన్ లో టాప్ మోస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ త్రిష.. ఈ వయసులో కూడా ఈమె అందం గురించి , అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. వివాహ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ వివాహ విషయం పైన రూమర్స్ రావడంతో మరొకసారి క్లారిటీ ఇచ్చింది త్రిష.

41 యేళ్లు అయినా పెళ్ళికి దూరం..

త్రిష గతంలో ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకొని వివాహాన్ని సైతం క్యాన్సిల్ చేసుకుంది. అందుకు గల కారణాలు ఏంటి? అనే విషయం మాత్రం తెలియలేదు. దీంతో కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది.. దీంతో వరుసగా పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది త్రిష.. ప్రస్తుతం విశ్వంభర, థగ్ లైఫ్, విదాముమార్చి తదితర ప్రాజెక్టులలో సైతం నటిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 41 సంవత్సరాలు అయిన ఇంకా వివాహం చేసుకోలేదు.

త్వరలో పెళ్లికి సిద్ధమైన త్రిష..

Trisha: The real truth about marriage is out..!
Trisha: The real truth about marriage is out..!

గతంలో చాలామంది స్టార్ హీరోలతో ఎఫైర్ నడిపినట్టుగా వార్తలైతే వినిపించాయి.. ఇప్పుడు తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ ని వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే.. అది కూడా మలయాళ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ను వివాహం చేసుకోబోతోందని.. వీరిద్దరూ గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉంటున్నారని విధంగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయం పైన త్రిష స్పందిస్తూ.. ఒక మీడియా ఛానల్ లో మాట్లాడడం జరిగింది. తన పెళ్లికి సంబంధించి ఇప్పటికి ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి..

- Advertisement -

అయినా అభిమానుల్లో నిరాశ..

తన త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అని రాస్తున్నారు కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలియజేసింది..ఈ విషయం విని అభిమానులు సైతం నిరాశతో ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరియర్ పైన దృష్టి పెట్టానని.. ఒకవేళ వివాహం చేసుకుంటే ఖచ్చితంగా అందరికీ చెప్పే మరీ చేసుకుంటానని.. తన మీద వచ్చేటువంటి ఎలాంటి రూమర్స్ ను నమ్మవద్ద అంటూ తెలియజేసింది త్రిష.. ప్రస్తుతం త్రిష చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

17 సంవత్సరాలుగా స్టార్ హోదా..

ఇక త్రిష విషయానికొస్తే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ చెన్నై చిన్నది… తన అందంతో అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలతో కూడా నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. తన అంద చందాలతో ఉర్రూత లూగించింది. ఇండస్ట్రీకి వచ్చే దాదాపు 17 సంవత్సరాల కు పైగానే అవుతున్న తన అందంతో నటనతో అందరిని అలరిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు