Trivikram Cinematic Universe: ఇది ఒక హఠాత్ పరిణామం

సినీమాటిక్ యూనివర్స్. ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే ఇలాంటి సినిమాలు వచ్చేవి. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ క్రియేట్ చేసిన ఈ ట్రెండ్ ఇప్పుడు సంచలనంగా మారింది. సింపుల్ గా చెప్పాలంటే ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి కనెక్షన్ ఉండటం. ఒక సినిమాలో పాత్రలు ఇంకో సినిమా పాత్రలతో కనెక్టివిటీ కలిగి ఉండటం సినిమాటిక్ యూనివర్స్.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఖైదీ. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లారీ డ్రైవర్ నైట్ అంతా చేసిన ప్రయాణాన్ని, ఎదుర్కొన్న విధ్వంసాన్ని ఈ సినిమాలో చూపించి తన బ్రిలియంట్ టాలెంట్ ను బయటకు తీశాడు లోకేష్ కనకరాజ్. ఖైదీ సినిమా చూసి చాలామంది సప్రైజ్ అయ్యారు. ఇకపోతే ఖైదీ సినిమా తర్వాత మాస్టర్ అనే సినిమాను చేశాడు లోకేష్ కనకరాజ్.

మాస్టర్ సినిమా తర్వాత చేసిన విక్రమ్ సినిమా లోకేష్ కి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. దీనికి కారణం సినీమాటిక్ యూనివర్స్. ఖైదీ సినిమాలోని పాత్రలను విక్రమ్ సినిమాలోని పాత్రలకు కనెక్ట్ చేసి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. లియో సినిమా కూడా ఇది సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అంటూ ప్రూవ్ చేశాడు.

- Advertisement -

ఇకపోతే తెలుగు దర్శకులు కూడా సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసే పనిలో పడ్డారు. హనుమాన్ సినిమాతో రీసెంట్ గా సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ తన రెండవ సినిమా జై హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు ఇది ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగం అంటూ చెప్పుకొచ్చాడు. యంగ్ ఫిలిం మేకర్ శైలేష్ కొలను కూడా సినీమాటిక్ యూనివర్స్ ను తన హిట్ సినిమాలతో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ కూడా సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్ అన్ని చాలా ఫన్నీగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్. ఎందుకంటే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కి మంచి స్కోప్ ఉంది. వెన్నెల కిషోర్ పేరు కూడా ఈ సినిమాలో బాలసుబ్రమణ్యం.

అయితే పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేసిన సినిమా అజ్ఞాతవాసి. ఆ సినిమాలో వెన్నెల కిషోర్ ను కిడ్నాప్ చేస్తూ, వెన్నెల కిషోర్ పేరు పై ఆఫీస్ కి ఎంట్రీ ఇస్తాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ సినిమాలో వెన్నెల కిషోర్ పేరు బాలసుబ్రమణ్యం కావడం విశేషం. దీనిని గమనించి కొందరు త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఫన్నీగా క్వశ్చన్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు