Trivikram – Puri: ఎట్లాంటి సినిమాలు తీసేటోల్లు, ఇప్పుడు కుర్చీ మడతపెట్టి అని ఒకరు, పండగో అని మరొకరు

Trivikram – Puri: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు అంటే ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగ అశ్విన్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ అంటే వివి వినాయక్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరి పేర్లు వినిపిస్తూ వచ్చేవి. పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గన్ను నుండి బుల్లెట్లు బయటకు వచ్చినట్లు పెన్ నుండే ఆయన డైలాగులు బయటకు వస్తాయి. వారం రోజుల్లో కథను పూర్తి చేసి ఇంకో వారం రోజుల్లో డైలాగ్స్ ని రాసేసి త్వరగా సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లి ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్.

ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ అన్ని సినిమాలు చేసిన దర్శకుడు లేడు అని చెప్పొచ్చు అంత త్వరగా తన వర్కును ఫినిష్ చేస్తాడు పూరి. ఎంతోమంది స్టార్ హీరోలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. అయితే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక ప్రాపర్ హిట్ పూరి జగన్నాథ్ కెరీర్ లో పడలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చెప్పినట్టు పూరి జగన్నాథ్ కెరియర్ కూడా మార్ ముంత చోడ్ చింత అని ఎలా ఉంది. ఒకప్పుడు పూరీ జగన్నాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే ఒక రకమైన హై ఫీల్ ఉండి చూడాలని క్యూరియాసిటీ ఉండేది. అది ప్రస్తుతం మినిమం కూడా లేకుండా పోయింది.

 Puri Jagannadh

- Advertisement -

రీసెంట్ టైమ్స్ లో ఇద్దరు దర్శకులు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే కంటెంట్ ను నమ్ముకోవడం కొంతమంది అభిమానులకు బాధాకర విషయం అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్టేజికి ప్రతిసారి సాహిత్య విలువలు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ గుంటూరు కారం అనే సినిమాలో “కూర్చుని మడతపెట్టి” అని డైలాగ్ పెట్టి సాహిత్య విలువలను కూడా పక్కన పెట్టేసాడు గురూజీ. ఇకపోతే పూరి జగన్నాథ్ కి కూడా సాహిత్య విలువలు బాగానే ఉంటాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా డబల్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలో “ఎంజాయ్ పండుగో” అని సోషల్ మీడియా డైలాగును వాడేసాడు.

ఒకప్పుడు వాళ్ళు తీసిన సినిమాలతో, ఆ సినిమాలలోని సంగీతంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న ఈ ఇద్దరు దర్శకులు, ఇప్పుడు సోషల్ మీడియా కంటెంట్ నమ్ముకొని కూర్చుని మడతపెట్టి, ఎంజాయ్ పండుగో అంటుంటే చాలామంది ట్రోల్ చేయటం మొదలు పెడుతున్నారు. ఏదేమైనా వీరిద్దరూ కూర్చొని ప్రాపర్ గా ఒక కథను రాసి, హీరో క్యారెక్టర్ రాసి మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ కొడితే గాని వీరికి మంచి ఆదరణ దక్కదు. లేదంటే చాలామంది డైరెక్టర్ షెడ్డు కి వెళ్లిపోయినట్టు, వీరు కూడా వెళ్లిపోవడం తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు