Trivikram Srinivas : పురాణాలపై గురూజీకే ఎక్కువ నాలెడ్జ్… మరి వాటిపై సినిమా ఎందుకు తీయ్యడం లేదు ?

Trivikram Srinivas: మన దేశం కథలకు పుట్టినిల్లు. కథలు మనదేశంలో పుట్టి ఇతర దేశాలకు పాకాయి అని చాలామంది రచయితలు చెబుతూ ఉంటారు. మన దర్శకులు మన తెలుగు పుస్తకాలను, తెలుగు మహా గ్రంథాలను చదివితే ఇంతకు మించిన కథలు మరెక్కడా దొరకవు అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఎన్నో కల్పిత పాత్రలు, ఎన్నో వాస్తవిక కథలు, ఎన్నో చారిత్రాత్మక కథలు భారతదేశంలో ఉన్నాయి. అయితే వీటిని సినిమాలుగా తెరకెక్కించే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. ఎంతో అవగాహన ఉండి కూడా వీటిని పూర్తిస్థాయిలో ముట్టుకోవడానికి ఒక దర్శకుడు సాహసం కూడా చేయట్లేదు. అతను మరెవరు కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్.

స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గొప్ప రచయిత దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ రాసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సృష్టించాయి. త్రివిక్రమ్ రైటింగ్ లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. త్రివిక్రమ్ కొన్ని డైలాగ్స్ లో పురాణాలకు సంబంధించిన రిఫరెన్సులు ఇస్తూ ఉంటారు. త్రివిక్రమ్ స్పీచెస్ లో కూడా కొన్ని ఇవి చెబుతూ ఉంటారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గ్రంథాలమీద పురాణాల మీద మంచి అవగాహన ఉంది. ఏ క్యారెక్టర్ ని తీసుకున్న కూడా దాని గురించి అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి స్థాయి ఉంది. అయితే వీటిని బేస్ చేసుకొని ఒక కంప్లీట్ పాన్ ఇండియా సినిమా మాత్రం త్రివిక్రమ్ ఇప్పటివరకు చేయలేదు. కానీ ఈ పురాణాల మీద మన గ్రంధాల మీద అవగాహన కల్పించుకొని కొంతమంది యంగ్ దర్శకులు మాత్రం పాన్ ఇండియాలో సినిమాలు తీస్తూ వస్తున్నారు.

- Advertisement -

Trivikram Srinivas

నాగ అశ్విన్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరందరూ కూడా మన కథలను పురాణాల్లోని పాత్రలను తీసుకొని పాన్ ఇండియా లెవెల్లో సినిమాల చేసి హిట్ కొట్టారు. కానీ పూర్తి అవగాహన ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం పాన్ ఇండియాని లెవెల్లో సినిమా ఎందుకు చేయట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనా పాన్ ఇండియా లెవెల్లో త్రివిక్రమ్ సినిమా చూస్తే చాలామంది ఎలా ఉంటుంది అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు