Trivikram Srinivas: కళ్యాణ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ అంటే నవ్వేసి వెళ్ళిపోయిన త్రివిక్రమ్

Trivikram Srinivas: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్వయంవరం సినిమాతో మాటల రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని కొంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకోగలిగారు. తెలుగు సినిమా మాటలను కొత్త పుంతలు తొక్కించాడు. పోస్టర్ పైన త్రివిక్రమ్ పేరు చూసి కూడా సినిమాకెళ్లిన ఆడియన్స్ ఉన్నారు అని కూడా చెప్పొచ్చు. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారాడు త్రివిక్రమ్. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు అనే సినిమాను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా అనే సినిమాను తెరకెక్కించాడు.

Trivikram Srinivas With Family Visits Tirumala

బాక్స్ ఆఫీస్ వద్ద జల్సా సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి వరుస డిజాస్టర్ సినిమాలో వస్తున్న తరుణంలో ఈ సినిమాతోనే మంచి హిట్ వచ్చి కం బ్యాక్ ఫిలిం అయింది. ఇకపోతే త్రివిక్రమ్ తన కెరియర్లో ఒక రెండు సినిమాలను మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా కేవలం స్టార్ హీరోస్ తోనే చేశాడు. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో ఏకంగా మూడు సినిమాలను చేశాడు. వీటిలో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇక మూడవ సినిమా అజ్ఞాతవాసి తీవ్రమైన డిజాస్టర్ అయింది.

- Advertisement -

పవన్ కళ్యాణ్ కెరియర్ లో 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని, ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అక్కడితో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలామంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ వేసుకున్నారు. ఇకపోతే రీసెంట్ గా తన ఫ్యామిలీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుపతికి వెళ్లారు. అయితే అక్కడ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ అని అడగ్గాని ఏం మాట్లాడుకున్న సైలెంట్ గా కారు ఎక్కి వెళ్ళిపోయారు త్రివిక్రమ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు