Pawan Kalyan : ఎయిర్ పోర్ట్ లో పవర్ స్టార్ తో గురూజీ.. ఇక పెండింగ్ పనులన్నీ సెట్టైపోయినట్టే?

Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది కింద రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేసేవాడు. అందుకే ఒకేసారి అరడజను సినిమాలు లైన్లో పెట్టాడు. అయితే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవగా, ఎమ్మెల్యే గానే కాకుండా, ఏకంగా డిప్యూటీ సీఎం కావడంతో పవన్ కళ్యాణ్ కి అనుకున్నదానికన్నా ఎన్నో రేట్లు బాధ్యత పెరిగింది. అందుకే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సినిమాలన్నిటిని హోల్డ్ లో పెట్టేసాడు. ప్రస్తుతం సెట్స్ పై మూడు సినిమాలున్న సంగతి తెలిసిందే. ఇటు నిర్మాతలు కూడా ఎన్ని రోజులు ఓపిక పడతారు. అందుకే పవన్ పై ఒత్తిడి ఎక్కువైంది. ఇక ఫైనల్ గా ఓ సందర్భంలో కాస్త ప్రజాసేవ చేసుకుని లేట్ అయినా సరే పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని అభిమానులకు మాటిచ్చాడు.

Trivikram Srinivas with Pawan Kalyan at Gannavaram Airport

గురూజీ తో పవన్.. సీన్ రిపీట్ అవుద్దా?

ఇక పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా అంబానీ ఇంట పెళ్ళికి హాజరైన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ దీక్ష వస్త్రాలతో ఉండి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక తాజాగా ఆ వేడుక ముగించుకుని హైదరాబాద్ వచ్చేయగా, తాజాగా అక్కడి నుండి పవన్ కళ్యాణ్ తిరిగి గన్నవరంకు చేరుకున్నారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించడం జరిగింది. అలాగే ఆర్ట్ డిజైనర్ ఆనంద్ సాయి కూడా ఉన్నాడు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుండి ఇద్దరూ ఒకేకారులో వెళ్లారు. అయితే ఈ సీన్ చూసిన నెటిజన్లు పవన్ ఇక పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసేస్తాడు అంటున్నారు. గతంలో కూడా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు పవన్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో వంటి సినిమాల ప్రాజెక్టుల్ని దగ్గరుండి చూసుకున్నారు.

- Advertisement -

ఇక గురూజీ ఎంట్రీ ఇస్తే సెట్టయినట్టే?

త్రివిక్రమ్ దగ్గరుండి ఆ సినిమాల్ని చూసుకోవడం వల్ల తక్కువ రోజుల్లోనే ఆ సినిమాల షూటింగ్ లు ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ పవన్ నటిస్తున్న మిగతా సినిమాల ప్రాజెక్టులను కూడా త్రివిక్రమ్ దగ్గరుండి పర్యవేక్షించనున్నాడట. పవన్ కళ్యాణ్ కి తక్కువ రోజుల్లో పని పూర్తయ్యేలా త్రివిక్రమ్ డైరెక్టర్లతో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు కూడా 80 శాతం షూటింగ్ పూర్తయి పోగా, ఆ మూడు సినిమాలకు కూడా చెరో 15 రోజులు కేటాయిస్తే సరిపోతుందని మేకర్స్ అంటున్నారు. త్రివిక్రమ్ కూడా ఖచ్చితంగా 15 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తయ్యేలా పవన్ డేట్లు అడ్జస్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ముందు పవన్ నుండి ఏ సినిమా వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు