Saripoda Sanivaram : నానికి దెబ్బేసెటట్లు ఉందే.. ఆ పొరపాటే సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందా?

Saripoda Sanivaram : టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం ( Saripoda Sanivaram ) మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ సినిమాలపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఆ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నా కూడా మరోవైపు ట్రోల్స్ ను అందుకుంటుంది.. మొన్నటివరకు పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీకి ట్రైలర్ వల్ల నెగిటివ్ టాక్ ను అందుకున్నట్లు తెలుస్తుంది. అసలు విషయానికొస్తే..

డైరెక్టర్ వివేకాత్రేయ (Vivek Athreya) నాని (Nani) కాంబినేషన్లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను అందుకోలేక పోయింది. కానీ జనాలను బాగా ఆకట్టుకుంది. సెలెబ్రేటీలు కూడా ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సరిపోదా శనివారం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై మొదట అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ వల్ల సినిమాకు దెబ్బ పడేట్లు ఉందని టాక్ వినిపిస్తుంది.

Trolls going viral on Saturday's trailer
Trolls going viral on Saturday’s trailer

సరిపోదా శనివారం ట్రైలర్..

నాని ఈ మధ్య సినిమా సినిమాకు వెరియేషన్ చూపిస్తున్నాడు. కొత్త పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఈ మూవీలో కూడా నాని ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. యముడు చిత్రగుప్తుడు ఇద్దరు ఒకే మనిషిలో.. ఉంటే ఎలా ఉంటుందో.. నాని పాత్ర అలా ఉంటుంది అంటూ సాయికుమార్ ట్రైలర్లు ఇచ్చిన హైప్ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. అలాగే మరోవైపు విమర్శలు కూడా అందుకుంటుంది. ట్రైలర్ లో నానికి ఆ ట్రైలర్ మ్యాచ్ అవ్వలేదట.. ఏదో పేరుకే అలా తీసినట్లు ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని కూడా వివేక్ హ్యాండిల్ చెయ్యలేక పోయినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏమాత్రం హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా అటు ఇటు అయితే మాత్రం నాని లైఫ్ లో ఆ డైరెక్టర్ ను నమ్మడని ఫ్యాన్స్ అభిప్రాయం పడుతున్నారు. ఈ మూవీలో ఎస్ జే సూర్య ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు