TUMBBAD: రీ రిలీజ్ కి సిద్ధం.. ధైర్యంగా చూడడానికి మీరు సిద్ధమా..?

Tumbbad.. సాధారణంగా కొన్ని సినిమాలు ఎంతలా ఉంటాయి అంటే వాటిని వర్ణించడానికి పదాలు కూడా ఉండవు. అలా మాటల్లో చెప్పలేని చిత్రాలలో తుంబాడ్ కూడా ఒకటి. మైథాలజికల్ హర్రర్ బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రానికి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2018లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది రివ్యూల పరంగా కూడా మెప్పు పొందిన ఈ చిత్రం ఊహించని కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాకు వచ్చిన ఆదరణకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి విపరీతమైన డిమాండ్ కూడా ఏర్పడింది. దీంతో మేకర్ పలు భాషల్లోకి సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశారు.

TUMBBAD: Ready for re-release.. Are you ready to watch it bravely..?
TUMBBAD: Ready for re-release.. Are you ready to watch it bravely..?

చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం..

ముఖ్యంగా ఈ సినిమాకి ఆదరణ బాగా పెరిగిన నేపథ్యంలో.. తెలుగుతోపాటు తమిళ్ , మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. రిలీజ్ అయిన ప్రతి భాషలో కూడా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిన్ని సినిమా లాక్డౌన్ కారణంగా ఓటీటీ లో వచ్చి అక్కడ కూడా మంచి రేటింగ్ అందుకుంది. అంతేకాదు ఓటీటీలో అత్యధిక టిఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా కూడా రికార్డు నమోదు చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

రీ రిలీజ్ కి సిద్ధమైన తుంబాడ్..

ఆగస్టు 30వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక ప్రకటన వెలువడింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ హారర్ చిత్రం రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

- Advertisement -

తంబాడ్ కథ..

ఈ చిత్రం సినిమా కథ విషయానికొస్తే, స్వాతంత్ర్యానికి ముందు మహారాష్ట్రలోని తుంబాడ్ అనే గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో ఈ కథ ఉంటుంది. అత్యాశ మనిషిని ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆరు సంవత్సరాల పాటు సాగింది. అనేక సన్నివేశాలను రీషూట్ చేశారు. అందుకే అన్ని సంవత్సరాలు సమయం పట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానండి ఏది ఏమైనా తుంబార్డ్ సినిమా ప్రేక్షకులను మరొకసారి భయపెట్టడానికి సిద్ధమవుతోంది. మరి ధైర్యంగా చూడడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది..

ఆరు సంవత్సరాలు షూటింగ్..

దర్శకుడు రాహి అనిల్ బర్వే 1993లో మరాఠీ రచయిత నారాయణ్ ధరప్ ద్వారా ఒక సన్నిహితుడు తనకు చెప్పిన కథను ఆధారంగా చేసుకుని స్క్రిప్టు రాయడం మొదలుపెట్టారు 18 సంవత్సరాల వయసులో అంటే 1997లో మొదటి స్క్రిప్ట్ రాయడం ప్రారంభించాడు.2009 నుండి 2010 వరకు దాదాపు 700 పేజీల స్టోరీ బోర్డును కూడా రూపొందించారు. పైగా 7 నిర్మాణ సంస్థలు దీనిని ఒప్పుకున్నాయి. కానీ షూటింగ్ సెట్ కి మాత్రం వెళ్లలేదు. ఇక తర్వాత ఒక నిర్మాణ సంస్థ ఏకంగా ఆరు సంవత్సరాల పాటు షూటింగ్ కొనసాగించి చివరికి 2018లో విడుదల చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు