OG Postponed: ఓజి రిలీజ్ డేట్ కు ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు

OG Postponed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. పవన్ చేసిన ఎన్నో సినిమాలు డిజాస్టర్ ఐనా కూడా అవి మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి. అయితే పవన్ రీఎంట్రీ తర్వాత చేసిన మూడు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్న కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఉన్న అధికార పార్టీ వలన కలెక్షన్స్ ను రాబట్టుకోలేదు. సినిమా టికెట్ రేట్లను తగ్గించడం చాలామంది ప్రభుత్వ అధికారులను సినిమా థియేటర్ వద్ద కాపలాగా ఉంచడం వంటి చాలా పనులను ఆ ప్రభుత్వం చేసింది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది.

Lucky Bhaskar

ఓజి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి అనే సినిమా నుంచి చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. పదేళ్ల క్రితం సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది అనే ఒక సినిమా వచ్చి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అదే డేట్ కి ఓజీ వస్తుందని చాలామంది ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఓజి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది.

- Advertisement -

ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు

ఓజి సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని చాలామందికి ఒక నమ్మకం ఉంది. అందుకని సితార ఎంటర్టైన్మెంట్స్ పై సినిమాలు నిర్మించే నాగ వంశీ లక్కీ భాస్కర్ అనే సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కూడా ఆ టైం కి ఓజీ సినిమా వస్తే మేము ఆగిపోతాం అంటూ చెప్పుకొచ్చారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన వీడియో కూడా విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాతో పాటు శివ కార్తికేయన్ నటిస్తున్న అమరన్ సినిమా కూడా అదే డేట్ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మలయాళం యంగ్ హీరో ఒక తమిళ్ యంగ్ హీరో సినిమాలు పోటీ పడనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు