Uday Kiran: ఉదయ్ కిరణ్ భార్య ఎక్కడ ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

Uday Kiran.. తెలుగు సినీ పరిశ్రమకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. వరుసగా హ్యాట్రిక్ సినిమాలలో నటించి.. భారీ క్రేజ్ దక్కించుకున్న ఈయన ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో తప్పటడుగు వేయడం వలనో లేక మరో కారణం తోనో వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. నిజానికి ఒక్క నైట్ లోనే స్టార్డం అందుకున్న ఈయన.. ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు ఎదురయ్యేసరికి.. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు.

తేజ చిత్రం మూవీ తో ఎంట్రీ..

2000వ సంవత్సరంలో దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని.. అందరి దృష్టిని ఆకర్షించిన ఉదయ్ కిరణ్.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక చిత్రం సినిమా తర్వాత మనసంతా నువ్వే, నువ్వు నేను, కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు.

సినిమాలు ఫ్లాప్ అవడం వల్లే ఆత్మహత్య..

అదే సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా దక్కించుకున్నాడు ఉదయ్ కిరణ్.. కానీ ఊహించని విధంగా ఉదయ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.. దీంతో డైలమాలో పడిపోయారు.. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ఈయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ..అక్కడ కూడా ఫ్లాప్ లు ఎదురవడంతో పూర్తిస్థాయిలో ఆందోళన చెందాడు.. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి..

- Advertisement -

విషిత తో వివాహం..

Uday Kiran: Where is Uday Kiran's wife? Do you know what she is doing?
Uday Kiran: Where is Uday Kiran’s wife? Do you know what she is doing?

అదే సమయంలో విషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.. వీరి వివాహం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది.. సినీ సెలబ్రిటీ లందరూ కూడా హాజరయ్యారు.. ఇక పెళ్లి తర్వాత చాలా సంతోషంగా గడిపారు ఇద్దరు.. కానీ అవకాశాలు తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.. భార్య జాబ్ చేస్తుండడంతో ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది.. భార్య సంపాదన పైన బ్రతకలేక ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోయారు ఉదయ్ కిరణ్. ఇక ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆయన భార్య విషిత ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అనే విషయాలు మాత్రం అభిమానులు తెలుసుకోవడానికి తన ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఒంటరిగా జీవిస్తున్న విషిత..

విషిత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆమె ఇంకో వివాహం చేసుకోలేదు.. జాబ్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంది విషిత.. అంతేకాదు పలు స్వచ్ఛంద సంస్థలను ఉదయ్ కిరణ్ పేరిట నడుపుతూ ఎంతో మంది అనాధ పిల్లలకు అండగా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఏది ఏమైనా తన భర్తను కోల్పోయిన తర్వాత అతడిని మరువలేక ఇంకో వివాహం చేసుకోలేక ఒంటరిగా జీవిస్తూ స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ఉదయ్ కిరణ్ అభిమానులు విషిత త్యాగానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు