Krishna Birth Anniversary : తెలుగు సినీ చరిత్రలో నటశేఖర ‘కృష్ణ’ సృష్టించిన చెరగని రికార్డులు!

Krishna Birth Anniversary : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూప‌ర్ స్టార్ కృష్ణ నట నట ప్రస్థానం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఐదు దశబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఉన్నత శిఖరాల్లో ఉంచిన అగ్ర నటుల్లో ఒకరైన. పౌరాణిక, జానపదాల్లో ఇమిడిపోయి, ఒకే జోనర్ లో వెళ్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ని యాక్షన్ జోనర్ లోకి తీసుకెళ్లి సరికొత్త ప్రయోగాత్మక చిత్రాలకు శ్రీకారం చుట్టారు. టెక్నికల్ గా తెలుగు సినిమాని జాతీయ స్తాయిలో నిలబెట్టిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ చెప్పడంలో అతిశయోక్తి కాదు. వెండితెరని సమవుజ్జీలుగా ఏలుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో ఉప్పెనలా దూసుకొచ్చారు నటశేఖర “కృష్ణ”. కొన్ని వంద‌ల సినిమాల‌లో.. సరికొత్త, కథా, కథనాలతో కృష్ణ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన కృష్ణ కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి క్యారెక్ట‌ర్ల‌ని ఇండియన్ సినిమాల్లో తొలిసారిగా ప్రవేశ పెట్టారు. నటుడుగా మాత్రమే కాకుండా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయనాయకుడిగా కూడా తెలుగు ప్రజలని మెప్పించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సంపాదించిన కృష్ణ ఎన్నో రకాల రికార్డులని చిత్ర పరిశ్రమలో సృష్టించారు. నేడు సూపర్ స్టార్ కృష్ణ (మే31) జయంతి (Krishna Birth Anniversary) సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ తీసిన చిత్రాల్లో ఎప్పటికి నిలిచిపోయే కొన్ని రికార్డుల గురించి లెక్కేసుకుందాం..

Unbeatable movie records created by superstar Krishna

ఈ రికార్డులు సూపర్ స్టార్ కృష్ణ కే సాధ్యం..

- Advertisement -

తేనే మనసులు (1965)

నటశేఖర కృష్ణ ఇండస్ట్రీ తొలిరోజుల్లో నాలుగైదు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలే వేయగా, ఆయన హీరోగా పరిచయమైన తొలి సినిమా ‘తేనే మనసులు’. ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో మొదటి సాంఘిక రంగుల చిత్రంగా రికార్డు సృష్టించింది.

గూఢచారి116 (1966)

గూఢచారి 116.. తెలుగులోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి జేమ్స్ బాండ్ చిత్రంగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ సినిమా రికార్డులకు ఎక్కింది. 1966లో ఈ సినిమా విడుదలైన సంచలన విజయం నమోదు చేసింది.

సాక్షి (1967)

తెలుగులో తొలి స్కోప్ టెక్నోవిజన్ టెక్నాలజీలో ఔట్ డోర్ షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ‘సాక్షి’. 1967లో విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. అంతే కాదు లెజెండరి దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది.

మోసగాళ్లకు మోసగాడు (1971)

సూపర్ స్టార్ కృష్ణ నటించిన “మోసగాళ్లకు మోసగాడు” సినిమా 1971లో పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వం లో తెరకెక్కగా, ఈ చిత్రం ఇండియా లో తొలి కౌబాయ్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

గూడుపుఠాణి (1972)

కృష్ణ హీరోగా 1972లో తెరకెక్కిన ‘గూడుపుఠానీ’ మూవీ తొలి ORW కలర్ మూవీ గా చరిత్ర సృష్టించింది.

అల్లూరి సీతారామరాజు (1974)

పద్మాలయ స్టూడియో పతాకంపై సూపర్ స్టార్ కృష్ణ నిర్మాణంలో వి.రామచంద్రరావు, కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ తొలి తెలుగు సినిమా స్కోప్‌ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈనాడు (1982)

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా 1982లో విడుదలైన ఈనాడు సినిమా తెలుగులో ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.

సింహాసనం (1986)

సూపర్ కృష్ణ హీరోగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా “సింహాసనం”. తెలుగులో ఫస్ట్ 70 MM మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ 6 ట్రాక్ స్టీరియో సిస్టమ్‌తో తెరకెక్కింది. పైగా ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో కూడా కృష్ణ తెరకెక్కించారు. కాగా హిందీలో జితేంద్ర హీరోగా నటించారు.

తెలుగు వీర లేవరా (1995)

తెలుగులో ఫస్ట్ డీటీఎస్ (DTS) మూవీ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘తెలుగు వీర లేవరా’ సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు