Unstoppable: చాలా ఏళ్ళు తరువాత

తెలుగులో విజయవంతమైన టాక్ షోలలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె ది ఒక ప్రత్యేకమైన స్థానం.ఈ షో మొదలైనప్పుడు బాలయ్య ఏంటి, అతనితో టాక్ షో అని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తూ షోని టాప్ పొజిషన్‌లో నిలబెట్టారు. ఇటీవలే మొదలైన సీజన్ 2 కూడా విజయవంతంగా రన్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో పాల్గొనే సెలబ్రిటీస్ వీరే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైరల్ అవుతోంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షోలో కనిపించబోతున్నట్లు సమాచారం. టాక్ షోలలో ప్రభాస్ చాలా అరుదుగా కనిపిస్తాడు. చాలా కాలం తర్వాత ఆయన ఓ టాక్ షోకి రానున్నారు, టాక్ షో లో ప్రభాస్ తో పాటు గోపీచంద్‌ కూడా కనిపిస్తారనేది ఆసక్తికర విషయం. ప్రభాస్, గోపీచంద్‌లు వర్షం సినిమాలో నటించినప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలసి సినిమా చేయబోతున్నారని అప్పట్లో చాలా ఊహాగానాలు వినిపించాయి కానీ అవి ఏవి నిజం కాలేదు.

ఇదిలా ఉంటే, బాలకృష్ణతో ఇంటరాక్షన్ ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. వచ్చేవారం ఇదే షూటింగ్ జరగనుందని సమాచారం.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
మొత్తానికి చాలా ఏళ్ళు తరువాత ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడబోతున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్‌స్టాపబుల్ 5వ ఎపిసోడ్‌లో అల్లు అరవింద్, సురేష్ బాబు,దర్శకేంద్రులు రాఘవేంద్రరావు మరియు కోదండరామిరెడ్డి పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు