Upasana: ఆ టైంలో మాత్రమే క్లీంకారాతో ఉపాసన గడుపుతారు.. కేర్ టేకర్ షాకింగ్ కామెంట్స్..!

Upasana.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కోడలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన అంతకంటే ముందు అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలుగా మరింత పేరు సొంతం చేసుకుంది. ఉపాసన అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్ గా అందరితో కలివిడిగా కలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఈమె ఆ హోదాని చూపించుకోలేదని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా వీరి వివాహం జరిగిన 11 ఏళ్లకు క్లీంకారా ను తమ జీవితంలోకి ఆహ్వానించారు. ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు, కష్టాల తర్వాత క్లీంకారా జన్మించడం వారికి పూర్తిస్థాయిలో అదృష్టాన్ని తీసుకొచ్చింది.

Upasana: Upasana is done with kleenkara only at that time.. Caretaker's shocking comments..!
Upasana: Upasana is done with kleenkara only at that time.. Caretaker’s shocking comments..!

మెగా కుటుంబానికి అదృష్టంగా మారిన క్లీంకారా..

ముఖ్యంగా క్లీంకారా జననం ఒక్క ఉపాసన – రాంచరణ్ లకే కాదు తాతలకు కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఏకంగా చిరంజీవికి పద్మ విభూషణ్ లభించడం , రాజకీయాల్లోకి రావాలనుకున్న పవన్ కళ్యాణ్ కోరిక నెరవేయడమే కాకుండా ఏకంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం గా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆస్కార్ కార్పెట్ పై తల్లిదండ్రులు ఇద్దరు మెరిసారు. పైగా ఇటీవలే రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ ను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా క్లీంకారా తమ జీవితంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి ఘడియలే అని ఈ కుటుంబ సభ్యులు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు.

క్లీంకారా కేర్ టేకర్ గా లలిత..

ఇదిలా ఉండగా క్లీంకారా కోసం రామ్ చరణ్, ఉపాసన కేర్ టేకర్ ను నియమించిన విషయం తెలిసిందే ముఖ్యంగా సెలబ్రిటీలు తమ పిల్లల యోగక్షేమాలను చూసుకోవడానికి కేర్ టేకర్ ను ఏర్పాటు చేసుకుంటారని విషయం తెలిసిందే. సినిమాలు వ్యాపారాలతో బిజీగా ఉండేవారు తమ చిన్నారుల సంరక్షణ కోసం ఇలా కేర్ టేకర్ను నియమించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉపాసన , రాంచరణ్ కూడా బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలకు కేర్ టేకర్ గా పని చేసిన లలిత అనే మహిళలను నియమించుకున్నారు. లలిత అంబానీ కుటుంబంతో పాటు దక్షిణాదికి చెందిన ఎంతో మంది సెలబ్రిటీ కపుల్స్ పిల్లలకు ఆయాగా వ్యవహరించింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రాంచరణ్ , ఉపాసన దంపతులపై ప్రశంసలు కురిపించింది.

- Advertisement -

రామ్ చరణ్ , ఉపాసన దంపతులపై ప్రశంసలు..

రామ్ చరణ్ , ఉపాసన దంపతులు చాలా మంచివారు. నేను ఎంతోమంది స్టార్ కిడ్స్ కి ఆయాగా పనిచేశాను. వాళ్ళందరూ నన్ను బాగా చూసుకున్నారు. వీరు కూడా తమ కుటుంబంలో ఒకరిలా నన్ను చూసుకోవడం సంతోషంగా అనిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ చాలా మంచి వాళ్ళు నేను విశ్రాంతి తీసుకునే సమయంలో ఉపాసన పాపను చూసుకుంటారు. ఆమె అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ అయినప్పటికీ కూడా చాలా సింపుల్ గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆమెది. బేబీ విషయంలో కూడా నాకు ఏ రోజు ఆర్డర్స్ వేయలేదు. నన్ను వారి కుటుంబంలో ఒకరిగా చేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఉపాసన , రాంచరణ్ గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేసింది లలిత.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు