Urfi Javed: మూడేళ్లుగా అలాంటి పని చేయలేదు..కనీసం ముద్దు కూడా..!

Urfi Javed.. విచిత్ర వేషధారణకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఉర్ఫీ జావేద్ (Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తన వేషధారణతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది ఈ ముద్దుగుమ్మ. రకరకాల వస్తువులతో డ్రస్సులు డిజైన్ చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె వేసే వస్త్రధారణ, వేషధారణ అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు అప్పుడప్పుడు ఈమె పై ట్రోల్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ మూడేళ్లుగా అలాంటి పని చేయలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Urfi Javed: I haven't done such a thing in three years..at least even a kiss..!
Urfi Javed: I haven’t done such a thing in three years..at least even a kiss..!

ఫాలో కర్ లో యార్ షో లో షాకింగ్ కామెంట్స్..

తాజాగా ఫాలో కర్ లో యార్ అనే షో చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. గత మూడు సంవత్సరాలుగా తనకు శారీరక సుఖం లేదు అంటూ తెలిపిన ఉర్ఫీ జావేద్.. దీనికి చెప్పిన కారణం విని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

3 ఏళ్లుగా సెక్స్ లో పాల్గొనలేదు.

తాజాగా ఈమె మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉర్ఫీ జావేద్ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా నేను సెక్స్ లో పాల్గొనలేదు. ఈ మూడేళ్లలో నేను ఎవరిని కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తాను ఏ వ్యక్తితోనో రొమాంటిక్ గా మాట్లాడలేదని, దీనికి కారణం కూడా ఉంది అని ఆమె తెలిపింది.

- Advertisement -

ప్రైవేట్ జెట్ వచ్చేంత వరకు అలా చేయను..

నేను శారీరకంగా సంబంధం పెట్టుకోకపోవడానికి కారణం కూడా ఉంది. నాకు ప్రైవేట్ జెట్ వచ్చేంతవరకు ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోకూడదని, మూడేళ్ల క్రితమే ప్రమాణం చేశాను అంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది. నేను ఆత్మగౌరవంతోనే ఉన్నాను నా జీవితంలో అన్నీ కూడా నేనే చేశాను. నా భాగస్వామితో బలహీనంగా కనిపించడం నాకు ఇష్టం లేదు అంటూ తెలిపింది ఉర్ఫీ. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

పరాస్ కల్నావత్ తో రిలేషన్..

గతంలో ఉర్ఫీ పరాస్ కల్నావత్ తో రిలేషన్ లో వుంది. ఇకపోతే వీరిద్దరూ 2017 నుంచి 2022 వరకు డేటింగ్ చేశారు. ఆ తర్వాత విడిపోయారు. ఇక బిగ్ బాస్ ఓటింగ్ లో పాల్గొనింది కూడా.. ఆ తర్వాత ఈమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. అక్కడి నుంచి సినిమా అవకాశాల కోసం వింత బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు మూడేళ్లుగా సెక్స్ లో పాల్గొనలేదు అంటే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా ఉర్ఫీ చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.ఏది ఏమైనా ఎప్పటికప్పుడు విచిత్ర వేషధారణతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ , సడన్ గా ఇలాంటి కామెంట్లు చేసేసరికి అందరూ నోరెళ్ళబెట్టారు. ఏది ఏమైనా ఈమె తీసుకున్న నిర్ణయం పై అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు