Urfi Javed : హీరోయిన్ తో అసభ్య ప్రవర్తన… ఫ్యాషన్ పేరుతో హద్దులు దాటితే ఇదే గతి అంటున్న నెటిజన్లు

Urfi Javed : బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వింత వింత ఫ్యాషన్ పోకడలతో షాక్ ఇచ్చే ఈ బ్యూటీకి సంబంధించిన రోజుకో వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. హాట్ బాంబ్ జాన్వి కపూర్ లాంటి స్టార్ హీరోయిన్లు సైతం ఆమె ఫ్యాషన్ సెన్స్ ను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తారు. కానీ ఆమెలా కనబడే ధైర్యం మాత్రం చేయరు. ఈ బ్యూటీ ఫ్యాషన్ పేరుతో సోషల్ మీడియాలో చేసే అరాచకం అంతా ఇంతా కాదు. విచిత్రమైన బట్టలు ధరించి బాగా పాపులర్ అయిన ఉర్ఫికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆమెను అభిమానులు అసభ్యకరంగా తాకిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఉర్ఫితో యువకుల వెకిలి చేష్టలు

తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొని బయటకొచ్చిన ఉర్ఫికి ఊహించని షాక్ తగిలింది. ఆమెను కారు ఎక్కనివ్వకుండా అభిమానులు చుట్టుముట్టారు. హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి సాధారణమే. వాళ్ళంటే ఉన్న పిచ్చి కారణంగా అభిమానులు ఇలాంటి పని చేశారు. ఇలా చుట్టముట్టినప్పటికి ఎలాగోలా కార్లో కాలు పెట్టిన ఉర్ఫిని తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు కొందరు యువకులు. ఉర్ఫి తన కారులో సేఫ్ గానే కూర్చున్నప్పటికీ కార్ విండో ఓపెన్ చేసి ఉండడంతో కొంతమంది యువకులు ఆమెను చూడగానే షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేశారు. ఈ హడావుడిలో ఎక్కడపడితే అక్కడ చేతులేశారు. దీనికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో ఆమె అభిమానులను షాక్ కి గురిచేస్తుంది.

OTT Urfi Javed Bollywood

- Advertisement -

ఫ్యాషన్స్ సెన్స్ కారణంగానే ఇలా..

అయితే ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆమెపై సానుభూతిని చూపించడం పక్కన పెట్టి ట్రోల్ స్టార్ట్ చేశారు. ఫ్యాషన్ పేరుతో హద్దులు దాటితే ఇలాంటి గతే పడుతుంది అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఒంటిపై ఉండీ లేనట్టుగా ఉండే బట్టలను ఆమె వేసుకోవడం మానేస్తే బాగుంటుందని ఉచిత సలహా ఇస్తున్నారు.

వివాదాలు తక్కువేమీ కాదు…

అయితే ఉర్ఫి ధరించే బట్టలు ఇప్పటికే ఎన్నోసార్లు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. పబ్లిక్ ప్లేస్ లో ఒక మహిళ ఇంత దారుణంగా బట్టలు వేసుకోవడం ఏంటి? పాపులారిటీ కోసం ఇంతగా దిగజారాలా అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. కానీ అభిమానులు మాత్రం ఆమె ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది తన ఇష్టం అంటూ ఉర్ఫిని వెనకేసుకొస్తారు. అలాగే ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితమే ఓ పార్టీలో తప్ప తాగి తూలుతూ కనిపించింది. ఆమె ఎంతగా తాగిందంటే కార్లో ఎక్కి కూర్చోవడానికి ఫ్రెండ్స్ హెల్ప్ చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలఓ దుమారం రేపగా, ఉర్ఫిపై పలువురు దుమ్మెత్తిపోశారు. ఇక తాజాగా ఆమెను పలువురు అసభ్యకరంగా తాకిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోని చూసిన అభిమానులు ఏది ఏమైనప్పటికీ పబ్లిక్ గా ఒక మహిళను ఇలా అవమానించకూడదు అంటూ ఈ నీచమైన పనిపై మండిపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు