Urfi Javed: సమంత సీక్రెట్స్ రివీల్ చేసిన ఉర్ఫీ.. రోజూ అలా..!

Urfi Javed.. విచిత్ర వేషధారణతో అందరిని అలరిస్తున్న ఊర్ఫీ జావేద్ (Urfi Javed)నిజజీవితం గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉర్ఫీ జావేద్ లైఫ్ స్టైల్ మిగతా నటీమణులందరి కంటే కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె జీవిత నేపథ్యంపై ఒక వెబ్ షో కూడా రానుంది. దాని పేరు ఫాలో కర్ లో యార్..ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆగస్టు 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Urfi Javed: Urfi who revealed Samantha's secrets.. like this every day..!
Urfi Javed: Urfi who revealed Samantha’s secrets.. like this every day..!

సమంత నచ్చితే అలా చేస్తుంది..

ఇందులో ఉర్ఫీ నిజ జీవితానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు లభిస్తుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ షో ప్రమోషన్ కోసం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి తెలిపింది. సమంత (Samantha) నేను ఇంస్టాగ్రామ్ స్నేహితులము అంటూ జావేద్ తమ మధ్య ఉన్న రహస్య స్నేహ బంధాన్ని తెలిపింది. సమంతకు నా వీడియో నచ్చితే తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది. దీని వెనుక ఏదైనా ఉద్దేశం ఉందని నేను అనుకోవడం లేదు . నేను ఆమెతో ఇన్ స్టాగ్రామ్ లో పలుసార్లు ముచ్చటించాను అంటూ తెలిపింది ఉర్ఫీ. ఇకపోతే నిత్యం వెరైటీ డ్రెస్సులతో వార్తల్లో నిలిచే ఈమె ముక్కుసూటిగా కూడా మాట్లాడుతూ ఉంటుంది.

అతనిపై ప్రేమ ఒలకబోస్తున్న ఉర్ఫీ..

ఇప్పుడు ఆమె మరో విషయాన్ని ప్రస్తావించింది. అర్జున్ కపూర్ పై నాకు ప్రేమ ఉంది, ఆయన అంటే ఎంతో ఇష్టం అంటూ బాలీవుడ్ నటుడు పై తన ప్రేమను ఒలకబోసింది ఈ అందాల తార. అలా తన అందంతోనే కాదు తన విచిత్ర వేషధారణతో కూడా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది ఉర్ఫీ జావేద్.

- Advertisement -

ప్రైవేట్ జెట్ కొనేంతవరకు శృంగారంలో పాల్గొనను..

ఇదిలా ఉండగా ఈ షో ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె శృంగారం పై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకుంది. గత మూడు సంవత్సరాలుగా తాను శృంగారానికి దూరంగా ఉన్నాను అంటూ చెప్పిన ఈమె, ఈ మూడు సంవత్సరాల లో ఎవరితో కూడా ముద్దు ముచ్చట పెట్టుకోలేదని , కనీసం ఏ ఒక్కరితో కూడా రొమాంటిక్గా మాట్లాడలేదు అంటూ తెలిపింది. దీనికి గల కారణాన్ని కూడా ఆమె నిర్భయంగా చెప్పుకొచ్చింది. తాను తన జీవిత భాగస్వామి దగ్గర తక్కువగా ఉండాలని అనుకోవట్లేదని, అతడితో సమానంగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలిపింది. అంతేకాదు ఒక ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసే వరకు కనీసం ఏ ఒక్కరితో కూడా రొమాంటిక్గా మాట్లాడను అంటూ తెలిపింది ఉర్ఫీ జావేద్. ఇక నిన్న ప్రమోషన్స్ లో భాగంగా ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఊర్ఫీ వస్త్రధారణ విషయానికి వస్తే.. అసలు ఎలాంటి వస్తువులతో దుస్తులు ధరిస్తోంది అనే విషయాలు కూడా తెలియకుండా పోతుంది. చిత్ర విచిత్రమైన వస్తువులను దుస్తులుగా తయారు చేసుకొని శరీరాన్ని కప్పేస్తూ ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇనుప సామాన్లు, ఎండిపోయిన ఆకులు అలమలు ఇలా ఏది దొరికితే వాటిని వేషధారణలో భాగం చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు