Urfi Javed : అయ్యో పాపం.. ఉర్ఫీ ఎంత కష్టం వచ్చింది.. లైంగిక వేధింపులు..

Urfi Javed : బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ (Urfi Javed ) పేరుకు పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తుంది. ఇక సినిమాల సంగతి ఏమో గానీ వింత డ్రెస్సులతో జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. విచిత్ర డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. గతంలో కొందరు జనాలు ఆమె పై మండిపడ్డారు. అయిన ఆమె తీరు మాత్రం మారలేదు. ఉర్ఫీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తాజాగా వెరైటీ డ్రెస్సులో ప్రత్యక్షం అయ్యింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

పాప ఎప్పుడూ వింత ప్రయోగాలు చేస్తూ అందరిని ఆకర్షిస్తుంది.. కానీ ఈసారి మాత్రం వెరైటీగా పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా తనకు చేదు అనుభవం ఏర్పడిందని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. నాపేరెంట్స్ అభిమానుల ముందే ఆమెకు ఓ అసభ్యకరమైన ప్రశ్న వేశాడు ఓ 15 ఏళ్ల కుర్రాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుని వాపోయింది. నా కుటుంబం ముందు చాలా బాధించే సంఘటన జరిగింది. కెమెరామెన్లు నన్ను ఫోటోలు తీస్తుండగా ఒక కుర్రాళ్ల గుంపు నా ముందు నుంచి వెళ్లింది. అందులో ఒక బాలుడు ‘నీ బాడీ కౌంట్ ఎంత’? అని అడిగాడు. అబ్బాయికి దాదాపు 15 ఏళ్లు కూడా లేవు. నా కుటుంబం, తల్లి ముందు అలా అడిగడంతో నేను షాక్ అయ్యాను. ఆ అబ్బాయిని అందరి ముందు ముందు కొట్టాలి అనుకున్నాను.. కానీ వాళ్ల పేరెంట్స్ ను చూసి ఆగిపోయాను. మీ పిల్లలు ఎలా ఉన్నారో గమనించగలరు అని పోస్ట్ లో రాసుకొచ్చింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Urfi Javed's sexual harassment post by 15-year-old boy goes viral
Urfi Javed’s sexual harassment post by 15-year-old boy goes viral

కేరీర్ విషయానికొస్తే.. ఈమె పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ వెబ్ షోలు మాత్రం చేస్తుంది. ఫాలో కల్ లో యార్ ( Follow Kal lo Yar) పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon Prime Video) లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ ఈ వెబ్ షో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంటోంది. ప్రమోషన్ సమయంలో బాలుడి నుంచి ఉర్ఫీకి అసభ్యకరమైన ప్రశ్న ఎదురైంది. ఉర్ఫీకి అనుకూలంగా పలువురు మద్ధతు తెలిపారు. మొత్తానికి ఈమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..

 

View this post on Instagram

 

A post shared by @urfi_javed__

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు