Usha malpuri: ఛలో మూవీ పై శౌర్య తల్లి షాకింగ్ కామెంట్స్..!

Usha Malpuri.. టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోలలో హీరో నాగ శౌర్య కూడా ఒకరు. నాగశౌర్య ప్రస్తుతం బాగా కష్టపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితం అయితే లభించడం లేదు. ఛలో లాంటి హిట్టు అందుకున్న నాగశౌర్యకి మళ్లీ అలాంటి హిట్ రిపీట్ కాలేదని చెప్పాలి.. అయితే నాగశౌర్యకి మాత్రం ఆయన తల్లి ప్రముఖ నిర్మాత ఉషా మల్పూరి మాత్రం ఈయనకి బ్యాక్ బోన్ గా నిలుస్తున్నారు. నాగశౌర్య నటించిన కొన్ని చిత్రాలను ఆమె స్వయంగా నిర్మించారు కూడా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉషా మల్పూరి ఛలో సినిమాపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి..

నాగశౌర్య ఎప్పుడూ భిన్నమే..

Usha Malpuri: Shaurya's mother's shocking comments on Chalo movie..!
Usha Malpuri: Shaurya’s mother’s shocking comments on Chalo movie..!

నాగశౌర్య ఎప్పుడూ కూడా మేము చెప్పిన దానికి చాలా భిన్నంగా ప్రవర్తించేవాడు. ఒక వయసు వచ్చాక నీకు నచ్చింది చెయ్యి అని మేము చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.. అంతలా డిఫరెంట్ గా ఆలోచించేవాడు.. ఇక హీరోగా తాను అనుకున్నట్టుగానే గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే ఆ కష్టం మొత్తం నాగశౌర్యదే.. మా ప్రమేయం ఏమీ లేదు.. మేము ఏ రోజు కూడా నాగశౌర్య హీరోగా చేస్తానన్నప్పుడు ఆ చిత్రాలని మేము నిర్మించాలని అనుకోలేదు.. ఇక అయితే ఛలో చిత్రం నాగశౌర్య చేయాలనుకున్నప్పుడు నిర్మాతల కోసం వెతుకుతున్నాడు.. రెమ్యునరేషన్ కూడా అవసరం లేదు.. ఫ్రీగా చేస్తామని చెప్పినా సరే ఏ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు..ఆ సమయంలో ఎంతో బాధ అనిపించింది.. తట్టుకోలేకపోయాను.. ఇక ఎవరో నిర్మాత మనకు అవసరం లేదు.. మేమే నిర్మాతగా మారుతామని డిసైడ్ అయ్యాము. ఇక అలా ఛలో చిత్రాన్ని మేము నిర్మించాము అంటూ ఉషా మల్పూరి చెప్పుకొచ్చింది..

హిట్ అయింది కానీ లాభం రాలేదు..

అలాగే ఈ సినిమా సక్సెస్ కలెక్షన్ల గురించి ఆమె మాట్లాడుతూ సినిమా అయితే సూపర్ హిట్ అయింది కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ మాకు డబ్బులు ఇవ్వలేదు.. ఇక నర్తనశాల సినిమా ఫ్లాప్ అయినప్పుడు మాత్రం ఉదయాన్నే వచ్చి బయ్యర్లు మా ఆఫీస్ ముందు కూర్చున్నారు… లాభం వచ్చినప్పుడు మాకు ఇవ్వలేదు.. నష్టం రాగానే మా ఇంటి ముందుకు వచ్చేసారు అంటూ ఆమె విమర్శించారు.. ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు చాలా జరుగుతాయి అంటూ కూడా చెప్పుకొచ్చింది ఉషా మల్పూరి..

- Advertisement -

హిట్టు కోసం ఎదురుచూపులు..

నాగశౌర్య సినిమాలు అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నాగశౌర్య ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆడియన్స్ కి ఆయన బోర్ కొట్టేసారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇకపోతే గత ఏడాది రంగబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక అదే ఏడాది ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, పోలీస్ వారి హెచ్చరిక వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ సరైన సక్సెస్ మాత్రం లభించలేదు. ప్రస్తుతం ఒక సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు నాగశౌర్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు