Vaishnav tej: అయోమయంలో మెగా మేనల్లుడు.. కారణం..?

Vaishnav Tej: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎంత ప్రత్యేకమైన ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపు ఈ కుటుంబం నుంచే పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. అందులో కొంతమంది గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటే మరికొంతమంది స్టార్ హీరోలుగా చలామణీ అవుతున్నారు.. ఇంకొంతమంది సక్సెస్ ల కోసం ఎదురు చూస్తున్నారు.ఇక అలాంటి వారిలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా ఒకరు.. ప్రస్తుతం అవకాశాలు లేక అయోమయంలో పడ్డట్టయింది ఈయన పరిస్థితి..

మొదటి సినిమాతోనే రూ.100 క్లబ్ లో చేరిక..

Vaishnav tej: Confused mega nephew.. reason..?
Vaishnav tej: Confused mega nephew.. reason..?

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో.. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈయనపై దర్శకుల దృష్టి పడింది. పైగా మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయి.. మెగా అభిమానులకు షాక్ ఇచ్చారు వైష్ణవ తేజ్.. ఇంత పెద్ద హిట్ తో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత మాత్రం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.. ఉప్పెన సినిమా తర్వాత ఈయన మూడు సినిమాలు చేయగా.. మూడు సినిమాలు దారుణమైన ఫలితాలను అందించాయి. ఇటీవల విడుదలైన ఆదికేశవ సినిమా పరిస్థితి అయితే మరీ దారుణం.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిస్థాయిలో చతికిల పడిందనే చెప్పాలి. అయితే దీంతో అభిమానులు ఎందుకు వైష్ణవ్ సరైన సినిమాలు ఎంపిక చేసుకోలేకపోతున్నారు అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.. నిజానికి ఒక డైరెక్టర్ ఒక కథ చెబుతున్నప్పుడు వినడానికి ఒకలా ఉంటుంది.. కానీ వెండితెర మీదకు వచ్చేసరికి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి.. వినడానికి బాగున్నా కథ సినిమాగా తెరకెక్కినప్పుడు చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది.. ఇక అలాంటిదే ఆదికేశవ చిత్రం కూడా.. ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా బాగా నచ్చిందట.. కానీ తీసిన తర్వాత డిజాస్టర్ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి కథను వైష్ణవ్ తేజ్ ఎలా ఒప్పుకున్నారంటూ కూడా అప్పట్లో చాలా చర్చలు జరిగాయి.

స్క్రిప్ట్ సెలక్షన్ ఫెయిల్..

ఇకపోతే స్క్రిప్ట్ సెలక్షన్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల మెగా మేనల్లుడు కెరియర్ అయిపోయిందంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫస్ట్ సినిమాతో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో మార్కెట్ ప్రతి సినిమాకు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆదికేశవ సినిమా తర్వాత ఈయన మరింతగా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు .. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై అలా జరగకూడదని బాగానే ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అందరిలాగే ఈయనకి ఆఫర్లు రావడం లేదా లేక కథలు నచ్చక సినిమాలకు దూరంగా ఉంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మెగా మేనల్లుడు కాబట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ మరొకసారి డిజాస్టర్ ను చవిచూసే అంత ధైర్యం లేకపోవడం వల్లే సినిమాలకు ఒప్పుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి అయితే ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలో తెలియక అయోమయంలో పడ్డారు ఈ మెగా హీరో.. మరి రాబోయే రోజుల్లోనైనా గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు