Vaishnav tej: భారీ ఛాన్స్ కొట్టేసిన మెగా మేనల్లుడు.. హిట్ అవుతుందా..?

Vaishnav Tej.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ తోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు.. ఆ తర్వాత ఆయన నటించిన కొండపొలం సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.. ఇటీవల వచ్చిన ఆదికేశవ సినిమా కూడా పూర్తిగా బొక్క బోర్ల పడిందనే చెప్పాలి.. ఇలాంటి సమయంలో వైష్ణవ్ తేజ్ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. ఇక అందులో భాగంగానే ఏకంగా తన మామయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని కొట్టేశాడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్..

సక్సెస్ కోసం చిరంజీవి తాపత్రయం..

ఇకపోతే చిరంజీవి రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అనుకున్నంత స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు.. ముఖ్యంగా ఎక్కువగా రీమేక్ లు చేస్తూ అపజయాలు అందుకుంటున్నారు.. సొంత కథతో ఈ మధ్య వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి మొస్తారు విజయాన్ని సాధించారు.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లను బాగానే సాధించింది .. కానీ కథ పరంగా ఎన్నో విమర్శలు అందుకుంది.. అందుకే ప్రస్తుతం చిరంజీవి సీనియర్ హీరోలలో అందరికంటే వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు. ఒకపక్క బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ లు అందుకుంటూ దూసుకుపోతుంటే.. చిరంజీవి మాత్రం కథల ఎంపిక విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఆశలన్నీ విశ్వంభర సినిమాపైనే పెట్టుకుంటారు.

రంగంలోకి పేరున్న హీరోయిన్స్..

Vaishnav tej: Mega nephew who hit a big chance.. will it be a hit..?
Vaishnav tej: Mega nephew who hit a big chance.. will it be a hit..?

కళ్యాణ్ రామ్ తో బింబిసారా అనే టైం ట్రావెల్ మూవీ తీసిన యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడితో ఈ సినిమా చేస్తున్నారు చిరంజీవి.. ఎలాగైనా సరే విజయం సాధించాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు అందుకే ఈ సినిమా విజయం కోసం ఎన్నో కష్టాలు కూడా పడుతున్నారు.. విజువల్ వండర్ గా వస్తున్న ఈ సినిమా లో యువ హీరోయిన్లను కూడా తెచ్చి పెడుతున్నారు.. ఇప్పటికే చిరంజీవికి చెల్లెళ్ళు గా ఏకంగా నలుగురు పేరున్న హీరోయిన్స్ ని తీసుకున్నారని సమాచారం.. అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు కూడా ఉన్నారట..

- Advertisement -

విశ్వంభర లో వైష్ణవ్ తేజ్..

ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ చిత్రంలో మరో మెగా హీరో కూడా కనిపించనున్నారని సమాచారం..వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.. ఇందులో వైష్ణవ్ తేజ్ రోల్ ఎవరు ఊహించని విధంగా ఉండబోతుందట.. త్వరలోనే మెగా కాంపౌండ్ హీరో షూట్ లో పాల్గొనబోతున్నాడు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

చిరంజీవి కష్టాలు పలుస్తాయా..

ఇకపోతే చిరంజీవి ఈ సినిమా కోసం ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొంటున్నారు. కెరియర్ లోనే గతంలో ఎన్నడు పెట్టనంత బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు.. మరి ఈ చిత్రంతోనైనా మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ అలానే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటారో లేదో చూడాలి. ఏది ఏమైనా ఇద్దరికీ ఈ సినిమా లైఫ్ అండ్ డెత్ గా మారిపోయింది అని చెప్పడం సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు