Vaishnavi Chaitanya : పొరపాటున సినిమా కథ లీక్ చేసింది

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకునే వైష్ణవి. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టి అప్పట్లోనే మంచి గుర్తింపును సాధించుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురం లో సినిమాలో అల్లు అర్జున్ కి సిస్టర్ గా కనిపించింది. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. ఈ పాటలు కూడా అద్భుతమైన హిట్ అయ్యాయి.

Vaishnavi Chaitanya : The story of the film was told by mistake
Vaishnavi Chaitanya : The story of the film was told by mistake

ఇకపోతే వైష్ణవి చేస్తున్న సినిమా లవ్ మీ. ఈ సినిమాలో ఆశీష్ తో జంటగా ఈ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాను అరుణ్ భీమవరపు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా గురించి మాట్లాడుతూ దిల్ రాజు కూడా ఒక ఆర్య లాంటి సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను రీసెంట్ గా నిర్వహించారు.

స్పీచ్ లోనే సినిమా కథను రివీల్ చేసింది
ఈ ట్రైలర్ ఈవెంట్ లో అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఇక రీసెంట్గా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఈ సినిమా కథను చెప్పేసింది. ఈ సినిమాలో ఆశిష్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అంటూ, చాలా డేర్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్ దయ్యంతో డేంజర్ వద్దు అని చెప్పినా కూడా నేను ఆ దయ్యం దగ్గరికి వెళ్తాను అసలు కథ ఏంటో కనుక్కుంటాను అని చెప్పి ఆ దెయ్యంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఆ దయ్యాన్ని లవ్ చేస్తాడు అంటూ సినిమా కథను రివీల్ చేసింది.

- Advertisement -

అయితే ఈ కథను రివీల్ చేసిన వెంటనే అక్కడున్న టీం అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయింది. అందరూ వైష్ణవి రివిల్ చేసిన కథను అలా వింటూ ఉండిపోయారు. దిల్ రాజు క్లైమాక్స్ కూడా చెప్పే అంటూ చెప్పుకొచ్చారు. తనకు తెలియకుండా తానే ఈ సినిమా కథను రివిల్ చేసింది. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు