Vaishnavi Chaitanya : త్వరలో గుడ్ న్యూస్… బేబీ హీరోయిన్ సీక్రెట్ లీక్ చేసిన హీరో

Vaishnavi Chaitanya : బేబీ మూవీతో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఫేట్ మారిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు దాకా యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లకు మాత్రమే పరిమితమైన వైష్ణవి చైతన్యకు ఇప్పుడు తెలుగు సినిమాల్లో మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే వైష్ణవి చైతన్య గుడ్ న్యూస్ చెప్తుంది అంటూ ఓ హీరో ఆమె సీక్రెట్ ను లీక్ చేశాడు. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే…

వైష్ణవి చైతన్య గుడ్ న్యూస్ ఇదేనా?

రీసెంట్ గా వైష్ణవి చైతన్య, ఆశిష్ జంటగా నటించిన లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ మూవీ ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే లవ్ మీ మూవీ ప్రమోషన్లలో భాగంగా రీసెంట్ గా ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న గేమ్ షోకి హాజరయ్యారు హీరో హీరోయిన్లు వైష్ణవి చైతన్య, ఆశిష్. షోలో భాగంగా ఒకానొక సందర్భంలో హీరో ఆశీష్ వైష్ణవి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది అనే విషయాన్ని చెప్పి అందరిని సర్ప్రైజ్ చేశాడు. కానీ వెంటనే యాంకర్ సుమ నీకే ఈమధ్య పెళ్లయింది. గుడ్ న్యూస్ చెప్తే నువ్వే చెప్పాలి అంటూ కౌంటర్ వేసింది.

సాఫ్ట్ వేర్ డెవలపర్' ఫేం వైష్ణవి చైతన్య బ్యూటిఫుల్‌ పిక్స్‌ | Sakshi

- Advertisement -

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా వైష్ణవి చైతన్య చెప్పబోతున్న గుడ్ న్యూస్ ఏంటి అనే విషయంపై చర్చ నడుస్తోంది. కొంతమంది త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్ లో ఎదుగుతోంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న ఇలాంటి తరుణంలో వైష్ణవి పెళ్లి ఎందుకు చేసుకుంటుంది? ఆ గుడ్ న్యూస్ ఏదో ఒక పెద్ద హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చి ఉంటుందేమో అంటున్నారు. మరి ఇంతకీ ఈ బ్యూటీ త్వరలో చెప్పబోతున్న గుడ్ న్యూస్ ఏంటి అనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

రీల్స్ నుంచి బిగ్ స్క్రీన్ దాకా…

సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ పాపులర్ అయిన అమ్మాయిలలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు. అలా రీల్ నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు బిగ్ స్క్రీన్ వైపు నడుస్తోంది. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో, నాని టక్ జగదీష్ సినిమాలలో కీలకపాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. అంతకంటే ముందు యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో దర్శనమిచ్చింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య కలిసి చేసిన బేబీ మూవీ ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో పాటు యూత్ లో వైష్ణవి చైతన్యకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందంతో పాటు అభినయం కూడా ఉన్న వైష్ణవి చైతన్యకి పెద్ద హీరోల నుంచి పిలుపు రావడమే మిగిలి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు