Anchor Suma: యాంకర్ సుమకి డబ్బు పిచ్చి.. గుట్టు రట్టు చేసిన వైష్ణవి చైతన్య..!

Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యాంకరింగ్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది సుమ. ఇక ప్రస్తుతం సుమ ఈటీవీలో షోలు, ఈవెంట్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈటీవీలో ప్రసారమయ్యే సుమ అడ్డ శనివారం కాకుండా ప్రతి సోమవారం ప్రసారం కానున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ మార్పులు చేర్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో సుమ అడ్డాకు లవ్ మీ టీం వచ్చి తమ కామెడీ, ఆట తీరుతో ఆకట్టుకుంది.

అయితే ఈ షో ప్రోమోలో సుమ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తుంది. ఇందులో సుమ హనుమాన్తో మాట్లాడుతూ కనిపిస్తుంది. అయితే స్వామి వారు సుమని.. ఏంటమ్మా నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కాథా ఉండాల్సింది అని అడుగుతారు. ఇకనుంచి మీ దయతో మంగళవారం ఎంటర్టైన్మెంట్ అందిద్దాం అనుకుంటున్నా స్వామి.. మీ ఆశీస్సులు కావాలి అని అడుగుతుంది. తధాస్తు అని ఆంజనేయస్వామి అంటారు. ఇక ఆ తర్వాత.. కాదు స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ సెలబ్రేషన్స్ అన్ని నాకే వచ్చేలా చూడండి అని అడుగుతుంది సుమ.

Anchor Suma hot photos with two braids.. Sumakka is not normal
Anchor Suma hot photos with two braids.. Sumakka is not normal

దీంతో స్వామి నా చేతిలో ఏముంది అమ్మ అని అనగా.. గదా అని చెప్తుంది. దీంతో స్వామి వారు.. అది ఇచ్చుకుని కొడతా అని వార్నింగ్ ఇస్తారు. ఇలా ఫన్నీగా ఈ ప్రోమో సాగుతుంది. అయితే ఇందులో సుమ దెయ్యాలు నైట్ టైం మాత్రమే ఎందుకు తిరుగుతాయని చెప్పగా.. వైష్ణవి అవి పగలంతా షో లు, ఈవెంట్స్ చేసి బిజీగా ఉంటాయని చెప్తుంది. దీంతో అది చూసిన ప్రేక్షకులు వైష్ణవి సుమాకి ఇండైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుమాకి డబ్బు పిచ్చి అందుకే ఎప్పుడూ షో లు చేస్తూ బిజీగా గడుపుతుందని చెప్పకనే చెప్పింది అంటూ ట్రోల్స్ జరుగుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు