Vaishnavi Chaitanya: ఆ స్టార్ హీరో పై మోజు పడుతున్న వైష్ణవి చైతన్య..!

Vaishnavi Chaitanya : తెలుగమ్మాయి.. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోలను కూడా తన వైపు చూసేలా చేసింది ప్రముఖ యూట్యూబర్, హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈమె పై ప్రశంసలు కురిపించారు అంటే.. ఈమె గుర్తింపు ఏ రేంజ్ కు వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు.. ఎక్కడో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ యూట్యూబ్ ప్రేక్షకులను అలరించిన వైష్ణవి చైతన్య.. సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక షార్ట్ ఫిలిమ్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి నటించింది. ఈ షార్ట్ ఫిలింతో భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు ఇందులోని హీరోయిన్ కి హీరో కి కూడా మంచి పేరు వచ్చింది.. ఇక హీరో విషయం పక్కన పెడితే హీరోయిన్ వైష్ణవి చైతన్య మాత్రం సినిమాలలో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది..

షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే కాదు సినిమాలలో అవకాశాలు కూడా..

షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నప్పుడే 2018లో టచ్ చేసి చూడు అనే సినిమాలో నటించినది.. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.. కానీ 2020లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2021 లో వచ్చిన రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఆ తర్వాత 2022లో తమిళ మూవీ వలిమై లో కూడా రమ్య పాత్రలో నటించి అలరించింది. ఇక ఈ సినిమాలలో ఒకరకంగా పేరు తెచ్చుకున్న ఈమె 2023లో ఏకంగా హీరోయిన్గా అవకాశాన్ని సొంతం చేసుకుంది..

బేబీ సినిమాతో స్టార్ స్టేటస్..

ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ లో వచ్చిన బేబీ సినిమా కథ ను మొదట ఆమె ఒప్పుకోకపోయినా డైరెక్టర్ దగ్గరుండి మరీ ఆమెను ఒప్పించినట్లు సమాచారం.. ఇక అలా బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది వైష్ణవి చైతన్య. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. మరొక హీరోగా విరాజ్ నటించిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఇప్పుడు మళ్లీ ఆనంద్ దేవరకొండ తో జతకట్టనుంది.. ఇంకొక వైపు దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన లవ్ మీ : ఇఫ్ యు డేర్ అనే సినిమాలో నటిస్తోంది.. ఈ సినిమా మే 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

మా హీరో అంటే ఇష్టం అంటున్న వైష్ణవి..

Vaishnavi Chaitanya: Vaishnavi Chaitanya is obsessed with that star hero..!
Vaishnavi Chaitanya: Vaishnavi Chaitanya is obsessed with that star hero..!

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా.. ఇందులో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.. తన సెలబ్రిటీ క్రష్ ఎవరు అని అడగ్గా తనకు రామ్ పోతినేని అంటే చాలా ఇష్టం అని.. ఆయనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా రామ్ పోతినేని పై ఈ ముద్దుగుమ్మ మోజు పడుతోంది అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు