Vamshi Paidipally: సీరియల్స్ ని కించపరచకండి

ఇళయదళపతి విజయ్ సినీ ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని వ్యక్తి. తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ వారిసు (తెలుగులో వారసుడు) సినిమా చేశాడు. దీనిలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా విడులైన మొదటి షో నుంచి మిక్సిడ్ టాక్ వచ్చింది. కొంత సినిమాలో ఎమోషనల్ సీన్స్, విజయ్ డ్యాన్స్, ఫైట్స్ బాగున్నాయని కామెంట్ చేస్తూంటే మరి కొందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.

అయితే ఈ సినిమా సీరియల్ లా ఉంది అని కూడా పలు కామెంట్లు వినిపించగా, వాటిపై స్పందిస్తూ వంశీ పైడిపల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ”విజయ్ ఇండియా లోని టాప్ హీరోస్ లో ఒకరు. అయినప్పటికీ, తన సినిమాల కోసం చాలా కష్టపడతారు. ప్రతి సీన్, డ్యాన్స్ స్టెప్స్, ఫైట్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఎంతో కష్ట పడి రిహార్సల్స్ చేస్తారు” అని చెప్పారు.

అలాగే  అలాంటి స్టార్ హీరో నటించిన ”వారసుడు” సినిమాని సీరియల్ తో పోల్చటం ఏంటి అని డైరెక్టర్ అసహానం వ్యక్తం చేశారు. “నిజానికి ఎంతో మంది సాయంత్రం అయేలోపు పనులు అన్ని ముగించుకొని సీరియల్స్ చూడటానికి సమయాన్ని కేటాయిస్తారు. ఇది కూడా ఒక సృజనాత్మక ఉద్యోగం. దయచేసి సీరియల్స్ ని కించపరచకండి” అని అన్నారు. అలాగే ఒకరిని కిందికి లాగాలి అని చూస్తే మనల్ని మనం దిగజార్చుకున్నట్లే అన్నారు.

- Advertisement -

“నేను సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఇక్కడకు సినిమాలు తీయటానికి వచ్చాను. ఆలా వచ్చినప్పటి నుంచి ఎంతో ట్యాలెంట్ ఉన్న హీరోలు, టెక్నిషన్స్ తో పని చేసిన అనుభూతి ఎంతో విలువైనది” అని చెప్పారు. ప్రస్తుతం తాను ఏంటో తనకు తెలుసునని, తానేమి గొప్ప అద్భుతమైన సినిమా తీశానని చెప్పడం లేదని, అయితే అందరికీ ఆహ్లాదాన్ని అందించే మంచి కమర్షియల్ సినిమా మాత్రం తీసానని తెలిపారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు