Varalakshmi Sarath Kumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ గారాలపట్టి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది.
తెలుగులో సైతం సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ఇక వరలక్ష్మి పర్సనల్ విషయానికి వస్తే.. 14 ఏళ్లగా నిక్లాయ్ పచ్ దేవ్ తో రిలేషన్ లో ఉన్న ఈమె ఈ ఏడాది మార్చ్ 1న ఎంగేజ్మెంట్ చేసుకుంది. కేవలం స్నేహితులు అండ్ కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగింది. ఇక తాజాగా వరలక్ష్మి పెళ్లి కి ప్లేస్ ఫిక్సయినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించిన ఈమె.. డెస్టినేషన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై రెండవ తారీకున థాయిలాండ్ లో చాలా గ్రాండ్ గా తన ప్రియుడుతో వరలక్ష్మి పెళ్లి జరగనుంది. ఇక ఈ వేడుకకు కొంతమంది బిగ్గెస్ట్ స్టార్స్ కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఎంగేజ్మెంట్ కి చాలా తక్కువ మందిని పిలిచారు ఈ జంట. కనుక పెళ్లయిన గ్రాండ్గా చేసుకుందామని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ఈ అమ్మడు ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు, చెన్నైలో జరుగుతున్నాయి.