Varalaxmi sharathkumar: పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్…!!

Varalaxmi sharathkumar:  కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ గా అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. క్రాక్ సినిమాకు ముందు వరకు ఈమె పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. క్రాక్ సినిమాలో మొదటిసారిగా లేడీ విలన్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమా మరొకసారి మంచి విజయాన్ని అందుకుంది. హనుమాన్ సినిమాలో అంజమ్మ పాత్రలో అద్భుతంగా నటించిన వరలక్ష్మి తన నటనతో ప్రశంసలు అందుకుంది. సినిమా జీవితం గురించి పక్కన పెడితే వరలక్ష్మి శరత్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా ఈమె లవ్ మ్యారేజ్ రూమర్స్ పైన తెగ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు తెలియజేసింది.

నాలుగు పదుల వయసుకి దగ్గరగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ తన మ్యారేజ్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. తన జీవితంలో పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని.. లైఫ్లో పెళ్లి అనేది ఒక పార్ట్ మాత్రమే అంటూ తెలియజేసింది. అది గోల్డ్ కాదంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.. తాను ఎప్పటికీ వివాహానికి వ్యతిరేకం కాదని ఇంట్లో తన పెళ్లి గురించి మాట్లాడడం తన 18 ఏళ్ల క్రితమే ఆపేసారని తెలియజేసింది.

- Advertisement -

తన దృష్టిలో పెళ్లి అనేది చాలా ముఖ్యం కావాలని.. మ్యారేజ్ చేసుకున్నా ఓకే.. చేసుకోకపోయినా ఓకే అంటూ తెలియజేసింది. ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా చాలామంది ఉన్నారు. తన స్నేహితురాలు త్రిష సైతం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉంది. పెళ్లి జీవితంలో ఒక భాగం మాత్రమే అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి.. బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ పైన పలు విషయాలను తెలియజేసింది. బాలీవుడ్ లో ఇప్పటికే పలు రకాల ఆఫర్స్ వచ్చాయి.. కానీ తనకు ఇష్టం లేదని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోనే మరిన్ని మంచి పాత్రలు వస్తే చేస్తానంటూ తెలిపింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు