BabyJohn : మరో సౌత్ హిట్ హిందీ రీమేక్.. చెడదొబ్బెలా ఉన్నారే?

BabyJohn : బాలీవుడ్ లో సౌత్ రీమేక్ లు చేయడం చాలా మామూలన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో సరైన కంటెంట్ సినిమాలు లేనప్పుడు సౌత్ సినిమాలనే నమ్ముకుంటారు అక్కడి స్టార్లు. ఇక ఈ ఏడాది ఆల్రెడీ సూరాయి పొట్రు, రీమేక్ బాలీవుడ్ లో చేస్తుండగా, ఇప్పుడు మరో బాలీవుడ్ రీమేక్ రెడీ అవుతుంది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా “బేబీ జాన్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏదో కాదు. విజయ్ దళపతి నటించిన సూపర్ హిట్ సినిమా “తేరి”. ఈ సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో “బేబీ జాన్” పేరుతో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, సౌత్ భామ కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఆ మధ్య టీజర్ కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నా, తేరీ కి బేబీ జాన్ కి చాలా తేడా ఉందని తెలుస్తుంది.

Varun Dhawan BabyJohn movie Release Date fixed

తెరి రీమేక్ గా బేబీ జాన్..

ఇక బాలీవుడ్ లో బేబీ జాన్ (BabyJohn) పేరుతో తెరకెక్కుతున్న తేరి రీమేక్ ని ఒరిజినల్ డైరెక్టర్ అట్లీ సినిమాను సమర్పిస్తుండగా.. అతని వైఫ్ ప్రియా అట్లీ నిర్మిస్తోంది. ఇక బేబీ జాన్ సినిమాని కలీస్ అనే దర్సకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఆ మధ్య బేబీ జాన్ టీజర్ రిలీజ్ అయినపుడు వరుణ్ ధావన్ చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించినా, ఎక్కడా తేరి ఫీలింగ్ కలగలేదు. ఇది బాగానే ఉన్నా, ఒరిజినల్ ని చెడగొడితే మాత్రం ట్రోలింగ్ లు తప్పవు. అలాగని మార్చకుండా ఉంటె కొత్తదనం ఉండదు. కొత్తగా ఎలా తీసినా ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలి. ఇక బేబీ జాన్ మూవీ లో కీర్తి సురేష్ తో పాటు, వామికా, అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్ వారు బేబీ జాన్ సినిమా తెరకెక్కిస్తుండటం వల్ల బహుశా మూవీ థియేటర్లలో రిలీజైన తర్వాత, జియో సినిమాలోకి ఛాన్స్ ఉంది.

- Advertisement -

రిలీజ్ డేట్ ఫిక్స్…

ఇక బేబీ జాన్ మూవీ కి సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చింది. బేబీ జాన్ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియచేసారు. ఇప్పటికే క్రిస్మస్ బరిలో సౌత్ నుండి మూడు సినిమాలు హోల్డ్ లో ఉండగా, బేబీ జాన్ ని అఫిషియల్ గా ఫిక్స్ చేసారు. ఇక బేబీ జాన్ సినిమాలో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ ఇప్పటికే సమంతతో కలిసి సిటడెల్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించాడు. ప్రస్తుతం బేబీ జాన్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమాని ఒరిజినల్ ని మ్యాచ్ చేసేలా హిందీలో తీయగలరా అనేది అసలు ప్రశ్న. అయితే అలా తీసినా తీయకపోయినా సినిమాలో బాలీవుడ్ మసాలాలు బాగా తగిలిస్తున్నారని, టీజర్, ఇంకా పోస్టర్లు చూస్తే తెలుస్తూనే ఉంది. ఇక నెటిజన్లు మాత్రం స్టిల్స్ చూసి చెడదొబ్బెలా ఉన్నారంటూ ట్రోల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు