Varun Dhawan : ఫన్నిగానే చెప్పాను

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి సనన్ లు ప్రేమలో ఉన్నారని చాలా రోజుల నుంచి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఆదిపురుష్ సినిమాలో కలిసి నటించిన వీళ్లు, షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట డేటింగ్ లో కూడా ఉందంటూ ప్రచారం సాగుతుంది. ఈ వార్తలకు బలం చేకూర్చడానికి చాలా జరిగాయి. ఆదిపురుష్ యూనిట్ అయోద్యకు వెళ్లిన సమయంలో ప్రభాస్, కృతి చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అప్పటి నుంచే ప్రభాస్-కృతి లవ్ లో ఉన్నారని అభిమానులు గట్టిగా నమ్మడం మొదలు పెట్టారు. అలాగే ఇటీవల భేడియా ప్రమోషన్స్ లో భాగంగా ఒక రియాలిటీ షోలో హీరో వరుణ్ ధావన్.. “కృతికి భాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అతను ప్రస్తుతం దీపికా పదుకొన్ తో ఒక సినిమా చేస్తున్నాడు” అని చెప్పాడు. దీంతో ప్రభాస్-కృతి లవ్ ట్రాక్ పై ఫ్యాన్స్ పూర్తి క్లారిటీకి వచ్చారు. కానీ తాజాగా కృతి తన ఇన్ స్టాగ్రామ్ లో పాన్ ఇండియా స్టార్ తో ప్రేమాయణం గురించి వస్తున్న న్యూస్ ను ఖండించింది. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పింది. వరుణ్ ధావన్ ఫన్నిగా చెప్పాడు అంటూ కామెంట్ చేసింది.

అయినా అభిమానులు నమ్మడం లేదు. ప్రభాస్-కృతి మధ్య ఎదో ఉంది అని నమ్ముతున్నారు. అయితే తాజాగా వరుణ్ ధావన్ ఒక రియాలిటీ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. కేవలం వినోదం కోసమే ఈ వ్యాఖ్యలు చేశానని, ఆ రియాలిటీ షో వాళ్లు కూడా ఫన్నిగానే తన వ్యాఖ్యలను ఎడిట్ చేశారని చెప్పుకొచ్చాడు. అయినా అభిమానుల సందేహాలు తీరడం లేదు. దీనిపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందిస్తే గానీ అభిమానుల డౌట్స్ క్లీయర్ కావు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు