Varun Sandesh: ఏఎన్ఆర్ అవార్డు.. వరుణ్ కే ఎందుకంటే..?

Varun Sandesh.. తెలుగు సినీ పరిశ్రమకు ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి ముఖ్య కారణమైనటువంటి వారిలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు.. ముఖ్యంగా సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చి సక్సెస్ బాట పట్టించిన మహానీయులలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో, నటనతో ప్రేక్షకులను అలరించిన ఏఎన్ఆర్.. ఎన్నో సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా ఇలాంటి ఒక గొప్ప నటుల గురించి.. ప్రముఖ నటులు, నిర్మాత, రాజకీయ వేత్త మురళీమోహన్ పలు విషయాలను తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

Varun Sandesh: ANR award.. because of Varun K..?
Varun Sandesh: ANR award.. because of Varun K..?

ఈ రోజున ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఫిలింనగర్ ఛాంబర్ లో జరిగిన వేడుకలలో అక్కినేని శత జయంతి నేడు.. మరోపక్క హీరోగా 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు రకాల అవార్డులను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే.. యువ ఎక్సలెన్స్ అవార్డును సైతం టాలీవుడ్ కుర్ర హీరో వరుణ్ సందేశ్ కు మురళీమోహన్ అందించారు.. అలాగే మురళీ మోహన్ మాట్లాడుతూ.. తన దృష్టిలో సినీ పరిశ్రమ ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణమైనటువంటి వారిలో అందరు హీరోలు కూడా ఉన్నారని కానీ ఏఎన్ఆర్ గారు చాలా కీలకంగా వ్యవహరించారంటూ వెల్లడించారు. ఇలాంటి వారి పేరు మీద అవార్డులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని.. అందులోనూ ఈ అవార్డులు తన చేతి మీద ఇవ్వడం మరింత ఆనందంగా ఉందంటూ మురళీమోహన్ వెల్లడించారు.

ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ..

80 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అక్కినేని నాగేశ్వరరావు చెరగని పాత్రలను చేశారు.. ఆయన కోసమే పుట్టినట్టుగా కొన్ని పాత్రలు ఉంటాయని.. ఇతర భాషా నటులు కూడా ఆయన నటన చూసి ప్రశంసిస్తూ ఉండేవారని తెలిపారు. అక్కినేని ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి అంటూ కూడా ప్రశంసించడం జరిగింది. అక్కినేని నటనతో ఎందరికో ఇన్స్పైర్ గా నిలిచారని.. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనను ఎన్నో పురస్కారాలతో కూడా గౌరవించారని తెలిపారు. అలాగే ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ లాంటి యువ నటుడిని గుర్తించి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలియజేశారు.

- Advertisement -

ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..

అలాగే నిర్మాత మండలి కార్యదర్శిగా వచ్చిన ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ , ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తెలుగు పరిశ్రమను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారని ప్రశంసలు అందించారు. ఇలాంటి వారి పేరు మీద వరుణ్ సందేశ్ కు అవార్డు ఇవ్వడం మరింత ఆనందంగా ఉందంటూ వెల్లడించారు..

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ…

ఈ విషయాలన్నిటి పైన వరుణ్ సందేశ్ మాట్లాడడమే కాదు తనకు ఈ అవార్డు రావడం పైన కూడా స్పందిస్తూ.. ఈ అవార్డు ఒక మహానటుడు ఆశీర్వాదంగా భావిస్తానని ఎమోషనల్ గా మాట్లాడారు. అలాగే సినీ దర్శకుడు రాజేష్ కూడా పాల్గొన్నారు. మొత్తానికి అయితే వరుణ్ సందేశ్ ఏఎన్ఆర్ అవార్డును సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు